Venkateswarlu
శ్రీలీల ఈ సంవత్సరం నాలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్కంధ, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు వరుసగా థియేటర్లలోకి వచ్చాయి..
శ్రీలీల ఈ సంవత్సరం నాలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్కంధ, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు వరుసగా థియేటర్లలోకి వచ్చాయి..
Venkateswarlu
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అవకాశాలు రావటం అన్నది టాలెంట్‌తో పాటు అదృష్టంతోనూ ముడిపడి ఉంటుంది. అవకాశాలు రావటం ఒక ఎత్తయితే.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్‌గా కొనసాగటం మరో ఎత్తు. అన్ని విషయాల్లో ఆరితేరిన వారికే ఇక్కడ సక్సెస్ సాధ్యం అవుతుంది. ముఖ్యంగా కథల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. లేదంటే కెరీర్ ఆకాశం నుంచి అథఃపాతాళానికి పడిపోతుంది. తక్కువ సినిమాలతోటే తట్టాబుట్టా సర్థు కోవాల్సి వస్తుంది.
చిన్న తప్పైనా తర్వాత కాలంలో పెద్ద మూల్యాన్ని కోరుకుంటుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు ఈ తప్పునే చేస్తున్నారు. తక్కువ కాలంలో.. చిన్న వయసులో సీనియర్ హీరోయిన్లకు పోటీ ఇస్తున్న ఈ తెలుగమ్మాయి.. కథల ఎంపిక విషయంలో బాగా వెనుకబడిపోయారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చిన కథను వచ్చినట్లుగానే ఓకే చేస్తే కెరీర్ నాశనం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ప్లాపులను దృష్టిలో పెట్టుకుని కథల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించాలని అంటున్నారు.
శ్రీలీల ఈ సంవత్సరం నాలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. స్కంధ, ఆదికేశవ, భగవంత్ కేసరి, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. అయితే, వీటిలో స్కంధ, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. భగవంత్ కేసరి హిట్ అయినప్పటికి మూడు సినిమాల ప్లాపు ఎఫెక్ట్ ఆమెపై పడింది. శ్రీలీల వచ్చిన కథను వచ్చినట్లుగా ఓకే చేస్తోందన్న టాక్ నడుస్తోంది.
సినీ విశ్లేషకులు ఏమంటున్నారంటే.. శ్రీలీలది చిన్న వయసు. తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. హీరోయిన్‌గా కొనసాగే లైఫ్ ఆమెకు చాలా ఉంది. కథల ఎంపిక విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఫెయిల్యూర్స్ నుంచి శ్రీలీల ఎంతో నేర్చుకోవాలి. భవిష్యత్తులో తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. లేదంటే ఊహించనంత తొందరగా ఫెయిడ్ అవుట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి.
మృణాల్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు దాదాపు రెండేళ్లు మాత్రమే అయింది. ఈ రెండేళ్లలో తెలుగు నాట సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. రెండేళ్లలో కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసింది. రెండు చిత్రాలతో యూత్‌కు ఫేవరేట్ నటిగా మారిపోయింది. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. కథల ఎంపిక విషయంలో మృణాల్ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు.
కొత్తదనం ఉన్న కథలకు ఓటేసి హిట్లను సొంతం చేసుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు. అయితే, తెలుగు నాట ముఖ్యంగా యూత్‌లో క్రేజ్ ఉన్న శ్రీలీల మాత్రం ఈ విషయంలో వెనుకబడ్డారని, మృణాల్‌ను చూసి నేర్చుకోవాలని అంటున్నారు. మంచి కథల్ని ఎంచుకుని భవిష్యత్తుకు గట్టి పునాది వేసుకోవాలని చెబుతున్నారు. మరి, శ్రీలీల కథల ఎంపిక విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.