iDreamPost
android-app
ios-app

గుంటూరు కారం మూవీ.. మహేష్ కి ధీటుగా శ్రీలీల లుక్!

  • Published Jun 14, 2023 | 12:12 PM Updated Updated Jan 04, 2024 | 5:36 PM
  • Published Jun 14, 2023 | 12:12 PMUpdated Jan 04, 2024 | 5:36 PM
గుంటూరు కారం మూవీ.. మహేష్ కి ధీటుగా శ్రీలీల లుక్!

పెళ్లి సందడి మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది క్యూట్ బ్యూటీ శ్రీలీల. ఈ సినిమా ఎవరేజ్ గా నిలిచినా సరే.. శ్రీలీల కెరీర్ మాత్రం టాప్ గేర్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ గా రాణిస్తోంది శ్రీలీల. చేతి నిండా సినిమాలతో కెరీర్ లో ఫ్ల్ బిజీ గా ఉంది. పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది శ్రీలీల. గతేడాది ‘ధమాకా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీలీల.. ప్రస్తుతం అరడజనుకి పైగా సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ టాలీవుడ్ లోనే మోస్ట్ బిజీయెస్ట్ బ్యూటీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ భామ మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో బుధవారం శ్రీలీల బర్త్ డే సందర్భంగా గుంటూరు కారం సినిమా నుంచి ఈ భామ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ఈ లుక్ ప్రకారం సినిమాలో శ్రీలీల విలేజీ బ్యూటీగా కనిపించనుంది అని అర్థం అవుతుంది. లంగా ఓణీలో కాలికి నెయిల్ పాలిష్ పెడుతున్న పోజ్ లో కూర్చుని ఉంది ఈ బ్యూటీ. ఈ పోస్టర్ లో శ్రీలీలని చూస్తుంటే.. ‘గుంటూరు కారం’లో హీరో మహేష్ బాబునే డామినేట్ చేస్తుందా అనిపించేలా ఉంది.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. అలానే రామ్-బోయపాటి మూవీలో శ్రీలీల ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో మోడ్రన్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ఇవే కాక పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో శ్రీలీల నటిస్తుంది.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetfixbetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş