iDreamPost
android-app
ios-app

Tanikella Bharani: తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఇన్నాళ్లకు

Tanikella Bharani.. తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే గుర్తుకు వచ్చే పేరు తనికెళ్ల భరణి. రచయిత నుండి నటుడిగా మారిన ఆ ప్రస్థానం అనిర్వచనీయం. ఇప్పుడు ఆయనకు ఎనలేని గౌరవం దక్కింది.

Tanikella Bharani.. తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే గుర్తుకు వచ్చే పేరు తనికెళ్ల భరణి. రచయిత నుండి నటుడిగా మారిన ఆ ప్రస్థానం అనిర్వచనీయం. ఇప్పుడు ఆయనకు ఎనలేని గౌరవం దక్కింది.

Tanikella Bharani: తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఇన్నాళ్లకు

తనికెళ్ల భరణి కేవలం నటుడే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి. తన విలక్షణ నటనతో ప్రేక్షకులకు ఎంతగానో అలరించాడు. కమెడియన్, విలన్, డైరెక్టర్, రైటర్.. వాట్ నాట్. స్టేజ్ ఆర్టిస్టు నుండి వెండితెరపైకి వచ్చాడు. రచయిత నుండి ఆర్టిస్టుగా  మారాడు. ఇప్పటి వరకు 750 సినిమాలు చేశాడు. కేవలం తెలుగు మాతమ్రే కాకుండా తమిళ్, హిందీ, కన్నడ సినిమాల్లో నటించాడు. ఆయన కలం యోధుడు. ఆయన వారసత్వంలో ఉంది. తిరుపతి వెంకట కవులు, ప్రముఖ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత విశ్వనాథ సత్యనారాయణలకు సమీప బంధువు. 52 సినిమాలకు మాటలను అందించిన రచయితగా నిలిచాడు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందించాయి. నందులు కూడా వరించాయి.

రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘సముద్రం’ సినిమాకు ఉత్తమ విలన్‌గా, ‘నువ్వు నేను’ సినిమాలోని నటనకు ఉత్తమ క్యారెక్టర్‌ నటునిగా, ‘గ్రహణం’తో ఉత్తమ నటునిగా, ‘మిథునం’ సినిమాకు గాను ఉత్తమ రచయిత మరియు ఉత్తమ దర్శకునిగా ఐదు నంది అవార్డులను అందుకున్నారు. లేడీస్ టైలర్ మూవీతో మొదలైన ఆయన నట ప్రస్థానం ఇంకా సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతుంది. ఇప్పుడు చాలా చూసీగా పాత్రలు ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. తనికెళ్ల భరణి పేరు చెబితే చాలా మందికి యమలీలలో ‘నా చెల్లికి మళ్లీ పెళ్లి’ ఎంతలా గుర్తు ఉంటుందో.. పాపం నాన్న ఎందుకో వెనకబడ్డాడు తండ్రి గురించి చెప్పి ఎమోషనలైన గాయకుడు కనిపిస్తాడు.

ఇక ఆయన ఆధ్యాత్మికత గురించి ఎంత చెప్పినా తక్కువే. మహా శివుడికి పరమ భక్తులు. ఆటగదరా శివ, నాలోన శివుడు కలడు సాంగ్సే అందుకు ఉదాహరణ. ఈ విలక్షణ నటుడికి ఇప్పుటికీ అరుదైన గౌరవం దక్కింది. ఈ అభిమాన నటుడికి గౌరవ డాక్టరేట్ ప్రకటించింది ప్రముఖ యూనివర్శిటీ. హన్మకొండలోని ఎస్ఆర్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. సినీ రంగానికి అందించిన విశేష సేవలకు గాను ఈ పురస్కారంతో సత్కరించనుంది ఈ విశ్వవిద్యాలయం. కాగా, ఇన్నాళ్ల కెరీర్‌లో ఆయన అందుకోబోతున్న తొలి డాక్టరేట్ ఇదే కావడం విశేషం అండ్ గమనార్హం. ఆగస్ట్‌ 3న వరంగల్‌ లో జరిగే యూనివర్శిటీ స్నాతకోత్సవ వేడుకలో ప్రధానం చేయనున్నట్టు ప్రకటనలో తెలిపింది విద్యా సంస్థ.