iDreamPost
android-app
ios-app

SP చరణ్ నష్టపరిహారం డిమాండ్.. తరుణ్ భాస్కర్ కోటి కట్టాలంటూ..!

SP Charan- Tarun Bhaskar: తరుణ్ భాస్కర్ ప్రస్తుతం చిక్కుల్లో పడ్డాడు. ఎస్పీ చరణ్ తరుణ్ భాస్కర్ పై లీగల్ గా యాక్షన్ కు రెడీ అయిపోయాడు.

SP Charan- Tarun Bhaskar: తరుణ్ భాస్కర్ ప్రస్తుతం చిక్కుల్లో పడ్డాడు. ఎస్పీ చరణ్ తరుణ్ భాస్కర్ పై లీగల్ గా యాక్షన్ కు రెడీ అయిపోయాడు.

SP చరణ్ నష్టపరిహారం డిమాండ్.. తరుణ్ భాస్కర్ కోటి కట్టాలంటూ..!

టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు ఏం అవసరం లేదు. ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పటికే తన టాలెంట్ ఏంటో పలు దఫాల్లో నిరూపించుకున్నాడు. ఒక్క డైరెక్టర్ గానే కాకుండా.. యాక్టర్ గా కూడా తన సత్తా చాటాడు. ఇటీవల వచ్చిన కీడా కోలా సినిమాతో అటు డైరెక్టర్ గా, ఇటు యాక్టర్ గా వందకు వంద మార్కులు కొట్టేశాడు. కలెక్షన్స్ పరంగా కూడా ఆ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేసింది. కానీ, ఇప్పుడు ఆ మూవీతో తరుణ్ భాస్కర్ చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. ఎస్పీ చరణ్ ఇప్పుడు తరుణ్ భాస్కర్ పై లీగల్ యాక్షన్ కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

కీడా కోలా చిత్రం టాలీవుడ్ లో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. నటుడిగా, డైరెక్టర్ గా తరుణ్ భాస్కర్ కు మంచి పేరే తెచ్చి పెట్టింది. ఇండస్ట్రీ నుంచి కూడా మంచి అప్లాజ్ లభించింది. ఈ మూవీలో తరుణ్ భాస్కర్ చాలానే ప్రయోగాలు చేశాడు. అందులో ఏఐ టెక్నాలజీ వాడి లెంజడరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ని రీ క్రియేట్ చేయడం కూడా ఒకటి. అయితే సోషల్ మీడియా వరకు ఇది బాగానే ఉన్నా.. తరుణ్ భాస్కర్ మాత్రం దానిని ఏకంగా సినిమాలో వాడేశాడు. సినిమా పరంగా ఏఐ వాయిస్ ని అందరూ ఎంజాయ్ చేసినా.. ఇప్పుడు ఆ పనే తరుణ్ భాస్కర్ ని చిక్కుల్లో పడేసింది.

తరుణ్ భాస్కర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ని వాడటంపై ఎస్పీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమ కుటుంబం అనుమతి లేకుండా తరుణ్ భాస్కర్ ఎస్పీబీ వాయిస్ ని వాడటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే లీగల్ నోటీసులు కూడా పంపారు. తాజాగా ఎస్పీ చరణ్ లాయర్ ఈ వివాదంపై స్పందించారు. తరుణ్ భాస్కర్ చేసిన పనికి క్షమాపణలు చెప్పడం మాత్రమే కాకుండా.. కోటి రూపాయల నష్టపరిహారం కట్టాలని తెలిపారు. అంతేకాకుండా రాయల్టీలో షేర్ కూడా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్ పెద్దఎత్తున చర్చకు దారి తీసింది.

ఈ వివాదం ఇప్పుడల్లా సమసిపోయే పరిస్థితి కూడా కనిపించడం లేదు. గతంలో నోటీసులు పంపిన సమయంలో ఎస్పీ చరణ్ ఏఐ టెక్నాలజీని ప్రసంశించారు. ఇప్పుడు మన మధ్యలేని తన తండ్రి గాత్రాన్ని ఇలా టెక్నాలజీ ద్వారా రీ క్రియేట్ చేయడం బాగుంది అన్నారు. అయితే ఇలా తమ అనుమతి తీసుకోకుండా వ్యాపారం కోసం వాడుకోవడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. అందుకే లీగల్ గా ముందుకెళ్తామని చెప్పారు. మరి.. ఈ నష్టపరిహారం, రాయల్టీలో షేర్ వంటి డిమాండ్లపై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. మరి.. ఎస్పీ చరణ్ నష్టపరిహారం డిమాండ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.