P Venkatesh
స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ ఆర్డర్ చేసేందుకు వెళ్లి షూ దొంగిలించిన విషయం తెలిసిందే. ఈఘటనపై సోనూసూద్ స్పందించారు. అతడికి మద్దతుగా నిలిచారు. దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింటా వైరల్ గా మారింది.
స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ ఆర్డర్ చేసేందుకు వెళ్లి షూ దొంగిలించిన విషయం తెలిసిందే. ఈఘటనపై సోనూసూద్ స్పందించారు. అతడికి మద్దతుగా నిలిచారు. దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింటా వైరల్ గా మారింది.
P Venkatesh
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు ఏవిధమైన డిమాండ్ ఉందో వేరే చెప్పక్కర్లేదు. నిత్యం లక్షలాది మంది ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకుంటూ ఆకలిని తీర్చుకుంటున్నారు. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో వంట చేసుకునే తీరిక ఎవరికీ దొరకడం లేదు. చాలా మంది ఫుడ్ డెలివరీ యాప్ లనే ఆశ్రయిస్తున్నారు. అయితే ఫుడ్ డెలివరీ సంస్థల్లో పనిచేసే డెలివరీ పర్సన్స్ కొంత మంది చేసే చెత్త పనులు కస్టమర్లకు విసుగు తెప్పిస్తున్నాయి. ఇటీవల స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లి షూ దొంగిలించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రియల్ హీరో సోనూసూద్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆ డెలివరీ పర్సన్ కు అండగా నిలిచారు. దీనికి సంబంధించిన పోస్టు నెట్టింటా వైరల్ గా మారింది.
సేవకు మారుపేరైన సోనూసూద్ కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకుని వారి పాలిట దేవుడయ్యాడు. కొన్ని ప్రాంతాల్లో ఈ రియల్ హీరోకు గుడి కట్టించి పూజలు చేసిన ఘటనలు ఉన్నాయి. ఆపదలో ఉన్నామని కబురు పెడితే అరక్షణం ఆలస్యం చేయకుండా ఆదుకుంటాడు సోనూసూద్. మరి ఇంతటి గొప్ప మనసున్న సోనూసూద్ మరోసారి తన గొప్పదనాన్ని చాటుకున్నారు. ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్లి ఓ ఇంటి ముందు ఉన్న ఖరీదైన షూను ఎత్తుకెళ్లాడు స్విగ్గీ డెలివరీ బాయ్. అతడికి అండగా నిలిచాడు సోనూసూద్. అతడిపై కంపెనీ కానీ, అధికారులు కానీ ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని కోరాడు.
స్విగ్గీ డెలివరీ బాయ్ మీ ఆర్డర్ లను డెలివరీ చేసే సమయంలో షూ చోరీ చేస్తే.. అతడిపై చర్యలు తీసుకోకండి. అతడికి కొత్త బూట్లు కొనివ్వండి. ఆ షూస్ అతడికి అవసరం కావొచ్చు. కానీ డెలివరీ పర్సన్స్ కు వచ్చేదే అంతంత మాత్రం ఆదాయం. కాబట్టి వారికి ఖరీదైన షూ కొనుక్కునే అవకాశం ఉండదు. అతడిపట్ల దయగా ఉండండి అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు సోనూసూద్. దీనిపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. దొంగతనం చేసిన వ్యక్తికి సపోర్ట్ చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి సోనూసూద్ డెలివరీ బాయ్ కి అండగా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
If Swiggy’s delivery boy stole a pair of shoes while delivering food at someone’s house. Don’t take any action against him. In fact buy him a new pair of shoes. He might be really in need. Be kind ❤️🙏
— sonu sood (@SonuSood) April 12, 2024