Somesekhar
కరోనా సమయంలో ఎన్నో వేల మందికి సాయం చేసి.. రియల్ హీరోగా మన్ననలు పొందాడు ప్రముఖ యాక్టర్ సోనూసూద్. ఇప్పటికీ.. సాయం చేసి, తన గొప్ప మనసును చాటుకుంటున్నాడు. తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు సోనూసూద్. అందులో..
కరోనా సమయంలో ఎన్నో వేల మందికి సాయం చేసి.. రియల్ హీరోగా మన్ననలు పొందాడు ప్రముఖ యాక్టర్ సోనూసూద్. ఇప్పటికీ.. సాయం చేసి, తన గొప్ప మనసును చాటుకుంటున్నాడు. తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు సోనూసూద్. అందులో..
Somesekhar
సోనూసూద్.. సాయం అనగానే అందరికి గుర్తుకు వచ్చే పేరు. కరోనా సమయంలో ఎందరికో సాయం చేసి, రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పటికీ ఎంతో మందికి సాయం చేస్తూ.. తన గొప్ప మనసును చాటుతూనే ఉన్నాడు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లోని పేద విద్యార్థికి సాయం చేసిన విషయం తెలిసిందే. అయితే ఉన్నట్లుండి సోషల్ మీడియాలో సోనూసూద్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. నువ్వు లేని ఈ ప్రపంచ అందంగా లేదంటూ రాసుకొచ్చాడు. ఎవరిని తలచుకుని ఈ పోస్ట్ చేశాడంటే?
సోనూసూద్ తన తల్లి సరోజ్ సూద్ ను తలచుకుని ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఆమె జయంతి సందర్భంగా భావోద్వేగానికి గురైయ్యాడు. “హ్యాపీ బర్త్ డే అమ్మా.. నువ్వు లేని ఈ ప్రపంచం నాకు అందంగా కనిపించడం లేదు. ఇక నువ్వు నాకు నేర్పిన నైతిక విలువలు, సూత్రాలతోనే జీవనం కొనసాగిస్తున్నాను. ఒక్కసారి నిన్ను ప్రేమగా హత్తుకుని, నిన్ను ఎంత మిస్ అవుతున్నానో చెప్పాలనుకుంటున్నాను. నా జీవితాంతం నువ్వు చూపించిన మార్గంలోనే నడుస్తాను. లవ్ యూ సో మచ్” అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
కాగా.. సోనూసూద్ కరోనా సమయంలో ఎన్నో వేల మందికి చేయూతను అందించాడు. కరోనా మహమ్మారి కారణంగా నిరాశ్రయులు అయినవారిని ఆదుకున్నాడు. ఇక తన తల్లి సరోజ్ సూద్ పేరిట అర్హులైన విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇవ్వడం మెుదలుపెట్టాడు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా సోనూసూద్ 2022 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి పేదలకు సాయం చేస్తున్నాడు.