iDreamPost
android-app
ios-app

క్యాన్సర్‌ని జయించిన మహేష్ హీరోయిన్.. పదేళ్ల తర్వాత రీఎంట్రీ!

  • Published Apr 25, 2024 | 10:20 PM Updated Updated Apr 25, 2024 | 10:20 PM

కృష్ణ జింకను వేటాడిందన్న కేసులో ఇరుక్కుంది. ఆ తర్వాత ఓ కేసులో అరెస్ట్ అయ్యింది. ఇవి చాలవన్నట్టు క్యాన్సర్ మహమ్మారి వెక్కిరించింది. వీటన్నిటినీ దాటుకుంటూ ఇప్పుడు మరోసారి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది మహేష్ హీరోయిన్.

కృష్ణ జింకను వేటాడిందన్న కేసులో ఇరుక్కుంది. ఆ తర్వాత ఓ కేసులో అరెస్ట్ అయ్యింది. ఇవి చాలవన్నట్టు క్యాన్సర్ మహమ్మారి వెక్కిరించింది. వీటన్నిటినీ దాటుకుంటూ ఇప్పుడు మరోసారి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది మహేష్ హీరోయిన్.

  • Published Apr 25, 2024 | 10:20 PMUpdated Apr 25, 2024 | 10:20 PM
క్యాన్సర్‌ని జయించిన మహేష్ హీరోయిన్.. పదేళ్ల తర్వాత రీఎంట్రీ!

మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోనాలి బింద్రే ఆ తర్వాత ఇంద్ర, ఖడ్గం, మన్మధుడు వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో సోనాలి అందానికి మెంటలెక్కిపోయేవారు జనాలు. కానీ సోనాలి బింద్రే తెలుగులో కంటే ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే నటించింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. మురారి కంటే ముందుగానే బొంబాయి సినిమాలో ‘హమ్మా హమ్మ’ అనే సాంగ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ పాటతో తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. చివరగా ఈమె తెలుగులో చేసిన సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్. ఆ తర్వాత  హీరోయిన్ గా సినిమాలు చేయలేదు.

2004లో వచ్చిన ఓ బాలీవుడ్ సినిమాలో ఐటం సాంగ్ చేసింది. వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై దొబారా మూవీలో ప్రత్యేక పాత్రలో మెరిసింది. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. పలు టీవీ షోస్ కి హోస్ట్ గా, జడ్జిగా కూడా వ్యవహరించింది. 2022లో ‘ది బ్రోకెన్ న్యూస్’ సీజన్ 1తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో న్యూస్ ఛానల్ హెడ్ గా నటించింది. ఇప్పుడు ‘ది బ్రోకెన్ న్యూస్’ సీజన్ 2తో అలరించేందుకు సిద్ధమైంది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే 2002లో గోల్డీ బెహ్ల్ అనే ఫిల్మ్ మేకర్, పారిశ్రామికవేత్తను వివాహం చేసుకుంది. 2005లో వీరికి ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత కేవలం టీవీ షోస్ కి మాత్రమే పరిమితం అయ్యింది. అయితే ఈమె పలు వివాదాల్లో కూడా ఇరుక్కుంది.

1998లో హమ్ సాత్ సాత్ హైన్ మూవీ షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీఖాన్, టబు, నీలం కొఠారి, సోనాలి బింద్రేలు కృష్ణ జింకలను వేటాడారని అభియోగాలు వచ్చాయి. వీరి మీద కేసులు కూడా పెట్టారు. ఆ తర్వాత సెషన్స్ కోర్టు 2018 ఏప్రిల్ 5న సోనాలిని నిర్దోషిగా తేల్చింది. 2001లో మరో వివాదంలో ఇరుక్కుంది. ఓం, ఓం నమశ్శివాయ అని ముద్రించి ఉన్న కురచ గౌను వేసుకుందని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎలాగోలా బయట పడిందనుకోండి. కేసులు, అరెస్టులు చాలవన్నట్టు ఆమెను క్యాన్సర్ మహమ్మారి కుదిపేసింది. 2018లో క్యాన్సర్ బారిన పడింది. ఈమెకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. నాలుగేళ్ల పాటు న్యూయార్క్ లో క్యాన్సర్ ట్రీట్ మెంట్ తీసుకుని 2021లో కోలుకుంది. ప్రస్తుతం మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈమె నటించిన ‘ది బ్రోకెన్ న్యూస్’ సీజన్ 2 వెబ్ సిరీస్ జీ5లో మే 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరి క్యాన్సర్ ను జయించి పదేళ్ల తర్వాత రీఎంట్రీకి సిద్ధమైన సోనాలి బింద్రేపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sonali Bendre (@iamsonalibendre)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet