iDreamPost
android-app
ios-app

Sonali Bendre: చివరి స్టేజీలో క్యాన్సర్.. బ్రతకనన్నారు : సోనాలి బింద్రే

  • Published May 10, 2024 | 11:54 AM Updated Updated May 10, 2024 | 11:54 AM

‘చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం’, ‘నువ్వు, నువ్వు, నువ్వే నువ్వు’ ఈ సాంగ్స్ పేరు చెబితే.. గుర్తుకు వచ్చే తొలి హీరోయిన్ సోనాలి బింద్రే. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని

‘చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం’, ‘నువ్వు, నువ్వు, నువ్వే నువ్వు’ ఈ సాంగ్స్ పేరు చెబితే.. గుర్తుకు వచ్చే తొలి హీరోయిన్ సోనాలి బింద్రే. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని

  • Published May 10, 2024 | 11:54 AMUpdated May 10, 2024 | 11:54 AM
Sonali Bendre: చివరి స్టేజీలో క్యాన్సర్.. బ్రతకనన్నారు : సోనాలి బింద్రే

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మురారి. 2001లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్. మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికీ చార్ట్ బస్టర్సే. ‘అలనాటి రామ చంద్రునికన్నింట సాటి.. ఆ పలనాటి బాల చంద్రుడి కన్నా అన్నింట మేటి’ ఇప్పటికీ ప్రతి పెళ్లిలోనూ వినిపిస్తూనే ఉంటుంది. మురారితోనే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే. ఇందులో మహేష్ ఆమెను చేసే టీజింగ్ భలే అనిపిస్తూ ఉంటాయి. తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసిన సోనాలీ తెలుగులో ఆరు సినిమాలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించి.. ప్రస్తుతం కాస్త రెస్ట్ తీసుకుంటుంది.

క్యాన్సర్ బారిన పడిన సోనాలి.. చికిత్స తీసుకుని చావు నుండి బయటపడింది. తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను తెలిపింది. ‘నేను 2018లో క్యాన్సర్ బారిన పడ్డాను. ఈ వార్త కుటుంబాన్ని కలచి వేసింది. నేను ఓ రియాలిటీ షో చేస్తున్న సమయంలోనే నేను అనారోగ్యం బారిన పడ్డా.జనరల్ చెకప్ కోసమని డాక్టర్ దగ్గరకు వెళ్లా.. ఏదో చిన్న ప్రాబ్లం అని చెబుతారు అనుకున్నా.. మెడికల్ టెస్టులు చేయించి తర్వాత క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. ఈ విషయం నా భర్తకు చెప్పగానే ఒక్కసారిగా నైరాశ్యంలో కూరుకుపోయారు. అప్పటికే క్యాన్సర్ చివరి దశ స్టేజ్-4లో ఉన్నట్లు తెలిపారు. బతికే అవకాశం కష్టమని.. కేవలం 30 శాతం ఛాన్స్ మాత్రమే మిగిలి ఉందని అన్నారు.

డాక్టర్ అలా చెప్పడంతో నా భర్త కోపంతో ఆయన్ను తిట్టారు. క్యాన్సర్ వచ్చిందని తెలిశాక.. అన్నింటికీ దూరంగా ఉంటూ చికిత్స స్టార్ట్ చేశా. కీమో థెరపీ చేయించుకున్నా. అది చాలా కఠినమైన చికిత్స అని అప్పుడే తెలిసింది. ఎందుకంటే.. నాకు జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నా. కానీ కీమోథెరపీ వల్ల ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. ఇంచు మించు చావు నుండి బయటపడ్డా’ అని తన బ్యాడ్ ఫేజ్ తలచుకుని బాధపడింది సోనాలి బింద్రే. దీని నుండి కోలుకున్నాక ఆమె ద బ్రోకెన్ న్యూస్ అనే వెబ్ సిరీస్‌తో అలరించింది. అలాగే బుల్లితెరపై కూడా పలు షోల్లో జడ్జిగా వ్వవహిస్తోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. తెలుగులో చిరంజీవితో ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్, నాగార్జునతో మన్మధుడు, బాలకృష్ణతో పల్నాటి బ్రహ్మనాయిడు వంటి చిత్రాల్లో నటించింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom