iDreamPost
android-app
ios-app

హీరోయిన్‌ పెళ్లి.. సొంత అన్నలే రాలేదు.. వారికీ వివాహం ఇష్టం లేదా?

  • Published Jun 25, 2024 | 10:23 AMUpdated Jun 25, 2024 | 10:23 AM

తాజాగా ఓ హీరోయిన్‌ పెళ్లి చేసుకుంది. అయితే ఈ వేడుకకు ఆమె సొంత అన్నలే హాజరు కాలేదు. దాంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వివరాలు..

తాజాగా ఓ హీరోయిన్‌ పెళ్లి చేసుకుంది. అయితే ఈ వేడుకకు ఆమె సొంత అన్నలే హాజరు కాలేదు. దాంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వివరాలు..

  • Published Jun 25, 2024 | 10:23 AMUpdated Jun 25, 2024 | 10:23 AM
హీరోయిన్‌ పెళ్లి.. సొంత అన్నలే రాలేదు.. వారికీ వివాహం ఇష్టం లేదా?

సాధారణంగా ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి అంటే.. అమ్మనాన్నల తర్వాత బాధ్యత అంతా తోబుట్టువులదే ఉంటుంది. మరీ ముఖ్యంగా అన్నాతమ్ముళ్లు చేసే కార్యక్రమాలే ఎక్కువగా ఉంటాయి. ప్రతి దానికి వారే ముందుండి నడవాలి. పెళ్లి పనులు మొదలు.. అప్పగింతల వరకు అన్ని కార్యక్రమాల్లో అన్నదమ్ముళ్లే ముందు వరుసలో ఉంటారు. ఒక వేళ తోబుట్టువులు ఎవరూ లేకపోతే.. అప్పుడు వరసకు అన్న, తమ్ముడు అయిన వారు.. ఆ పనులు చూసుకుంటారు. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరి ఇండ్లలో ఇలానే జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఓ హీరోయిన్‌ పెళ్లి జరిగింది. అయితే ఇంత ముఖ్యమైన శుభకార్యానికి ఆమె సొంత అన్నలే రాకపోవడం సంచలనంగా మారింది. వారికి ఈ అమ్మడి పెళ్లి ఇష్టం లేదా ఏంటి.. అందుకే రాలేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వివరాలు..

బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడేళ్లుగా డేటింగ్‌లో ఉన్న తన ప్రియుడు జహీర్‌ ఇక్బాల్‌తో ఏడడుగులు వేసింది. వీరద్దరూ ఏం సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటారనే దానిపై బోలేడు చర్చ జరిగింది. పైగా సోనాక్షి మతం మారుతుందనే ప్రచారం కూడా జరిగింది. కానీ చివరకు అందరికి షాక్‌ ఇస్తూ.. ఈ జంట రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఆ తర్వాత ఎంతో ఘనంగా రిసెప్షన్‌ వేడుకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోనాక్షి.. చేతికి ఎర్రగా పండిన గోరింటాకు, ఎర్రటి పట్టుచీర, చీరకు తగ్గట్లుగా రెడ్‌ బ్యాంగిల్స్‌.. సాంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ ఎంతో అందంగా రెడీ అయింది. ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు.. పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు హాజరయ్యారు.

అయితే ఎంతో ఘనంగా నిర్వహించిన సోనాక్షి పెళ్లి వేడుకకు ఆమె సొంత అన్నలిద్దరూ హాజరవలేదు. దాంతో ఈ వేడుకకు వచ్చిన బంధువులతో పాటు మీడియా సైతం లవ్‌ సిన్హా, ఖుష్‌ సిన్హా ఎక్కడని ఆరా తీశారు. కానీ ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు. అన్నలిద్దరూ ముందుండి.. చెల్లి పెళ్లి జరిపించాల్సింది పోయి.. ఇలా పత్తా లేకుండా పోయారేంటి.. ఈ వివాహం వారికి ఇష్టం లేదా ఏంటి అని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

సోనాక్షి పెళ్లికి ఆమె తల్లిదండ్రులు అయితే హాజరయ్యారు. కానీ ఆమె సోదరులిద్దరూ అటు వివాహానికి, ఇటు రిసెప్షన్‌కు దేనికీ హాజరవలేదని తెలుస్తోంది. జహీర్‌ను సోనాక్షి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఆమె అన్నలిద్దరూ ఈ కార్యక్రమానికి రాలేదని ప్రచారం జరుగుతోంది. దీని గురించి సోనాక్షి సోదరుడు లవ్‌ సిన్హా ప్రశ్నించగా.. అతడు ‘‘నాకు ఓ రెండు రోజులు టైమ్‌ ఇవ్వండి. సమాధానం చెప్పాలనిపిస్తే.. నేనే చెబుతాను’’ అంటూ దాటవేసే ప్రయత్నం చేశాడు.

ఇక వివాహం సందర్భంగా పెళ్లికూతురి సోదరుడు చేయాల్సిన కొన్న పనులను సోనాక్షి స్నేహితుడు, నటుడు సఖీబ్‌ సలీమ్‌ తన భుజాన వేసుకున్నాడు. ఆమెను మండపానికి తీసుకొచ్చేటప్పుడు పూల చద్దర్‌ను సఖీబ్‌ పట్టుకుని ముందు నడిచాడు. ఈ వీడియో వైరల్‌గా మారగా.. అదేంటి నీకు ఇద్దరన్నలు ఉన్నారు.. వాళ్లు ఎక్కడా కనిపించడం లేదేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కొత్త పెళ్లి కూతురు ఇంకా స్పందించలేదు. చూడాలి మరి ఈ వివాదానికి ఎలా ముగింపు పలుకుతారో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి