iDreamPost
android-app
ios-app

ఓటీటీలోకి బూట్‌కట్ బాలరాజు.. సోహెల్ ఏడ్చినందుకు ఇకనైనా చూస్తారా?

  • Published Feb 26, 2024 | 8:11 PM Updated Updated Feb 26, 2024 | 8:11 PM

Sohel Movie in OTT: బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటించిన బూట్ కట్ బాలరాజు ఓటీటీలోకి వచ్చేసింది.. ఈ మూవీ రిలీజ్ సమయంలో సొహైల్ ఎంతో ఎమోషన్ అయిన విషయం తెలిసిందే.

Sohel Movie in OTT: బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటించిన బూట్ కట్ బాలరాజు ఓటీటీలోకి వచ్చేసింది.. ఈ మూవీ రిలీజ్ సమయంలో సొహైల్ ఎంతో ఎమోషన్ అయిన విషయం తెలిసిందే.

  • Published Feb 26, 2024 | 8:11 PMUpdated Feb 26, 2024 | 8:11 PM
ఓటీటీలోకి బూట్‌కట్ బాలరాజు.. సోహెల్ ఏడ్చినందుకు ఇకనైనా చూస్తారా?

ఇటీవల ధియోటర్లలో రిలీజ్ అయిన సినిమాలు నెల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు సినిమా రిలీజ్ అయ్యిందంటే.. ఎప్పుడో టీవీలోకి వచ్చేవి. ఎప్పుడైతే ఓటీటీ అందుబాటులోకి వచ్చిందో సినీ లవర్స్ ఎక్కువగా దీనికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ధియేటర్లో మూసి వేయడంతో చాలా మంది ఓటీటీలో సినిమాలు చూశారు. అదే అలవాటుగా మారిపోయింది. ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ సందడి చేస్తున్నాయి. కొందమంది నిర్మాతలు తమ సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటించిన కొత్త సినిమా బూట్‌కట్ బాలరాజు ఓటీటీలోకి వచ్చేసింది. స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ ఇప్పటి వరకు 7 సీజన్లు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో సీజన్ 4 లో సెకండర్ రన్నరప్ గా నిలిచి ప్రేక్షకుల హృదయాలు గెల్చుకున్నాడు స‌య్య‌ద్ సోహైల్. 2008 లో కొత్త బంగారు లోకం మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ సీజన్ 4 తో తన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ మనసు గెలిచాడు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇటీవల సోహెల్ నటించిన ‘బూట్ కట్ బాలరాజు’ మూవీతో ఫిబ్రవరి 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కోసం భారీగానే ప్రమోషన్లు చేశాడు.. కాని సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. థియేటర్లో కొద్ది మందే దర్శనం ఇవ్వడంతో సోహెల్ చాలా ఎమోషన్ కి గురయ్యాడు. తాను ఫ్యామిలీ సినిమాలు తీస్తానని.. అందుకే ఆడియన్స్ కి నచ్చడం లేదని.. బూతు కంటెంట్ తీయడం తనకు రాదని, బిగ్ బాస్ లో నన్ను ఆదరించారు.. సినిమా ఎందుకు చూడరంటూ మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నాడు.

మొత్తానికి సోహైల్ నటించిన బూట్ కట్ బాలరాజు మూవీ నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది. అనుకున్నట్టుగానే బూట్ కట్ బాలరాజు తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతుంది.  ఇప్పటికే ఈ విషయాన్ని శుక్రవారం 23న అధికారికంగా వెల్లడించారు. సోమవారం ఫిబ్రవరి 26న సాయంత్రం 6 గంటల నుంచి ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కోసం తాము ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డామని.. సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నామని సోహైల్ రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నాడు. కానీ థియేటర్లకు మాత్రం ప్రేక్షకులను రప్పించలేకపోయాడు. ఈ సినిమాను ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడంత.. మీడియా ముందు చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. మరి ఇప్పుడు ఆహా ఓటీటీలో ‘బూట్ కట్ బాలరాజు’ ని ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి..   సోహైల్ ఏడ్చినందుకైనా అభిమానులు ఓటీటీలో అయినా చూస్తారా? లేదా? ముందు ముందు రిజల్ట్ ని బట్టి చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet