iDreamPost
android-app
ios-app

బేబీ విషయంలో విశ్వక్ పై ట్రోలింగ్ నడుస్తుందా..?

  • Author ajaykrishna Updated - 01:18 PM, Thu - 27 July 23
  • Author ajaykrishna Updated - 01:18 PM, Thu - 27 July 23
బేబీ విషయంలో విశ్వక్ పై ట్రోలింగ్ నడుస్తుందా..?

టాలీవుడ్ లో మరో వివాదం చిచ్చు రాజేసుకుంటోంది. రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచిన బేబీ మూవీ విషయంలో.. ఆ మూవీతో సంబంధం లేని హీరో విశ్వక్ సేన్ పై ట్రోలింగ్ జరుగుతుంది. ఇటీవల విడుదలైన బేబీ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే. దాదాపు పెట్టిన బడ్జెట్ కి నాలుగు రెట్లు లాభాలు తెచ్చిందని ట్రేడ్ వర్గాల టాక్. అయితే.. తాజాగా ఈ బేబీ విషయంలో తనను కించపరిచారంటూ ఓ మూవీ ఈవెంట్ లో పాల్గొన్న విశ్వక్ సేన్ చెప్పాడు. ఇండస్ట్రీలో ఓ సినిమా సక్సెస్ అయితే.. అందరు తలెత్తుకోవడంలో తప్పులేదు. కానీ.. తనను కించపరిచినందుకే బాధగా ఉందంటూ విశ్వక్‌ సేన్‌ అన్నాడు. గత రాత్రి ‘పేకమేడలు’ టీజర్ లాంచ్ కు ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్వక్.. బేబీ విషయంలో జరిగిన కాంట్రవర్సీ పై స్పందించాడు.

ఈ సందర్బంగా.. అందరినీ ఆనందపరిచేందుకు తానేమీ బిర్యానీ కాదంటూ.. సినిమా పేరు, డైరెక్టర్ పేరు చెప్పకుండానే కామెంట్స్ చేశాడు విశ్వక్. తాను మాట్లాడుతూ.. “ఎవరి స్థాయిలో వారు బిజీగా ఉంటాం. ఎలాంటి సినిమాలు చేయాలో స్పష్టత లేనప్పుడు ఎదుటివారి సమయం వృథా చేయొద్దని అనుకుంటాం. అందుకే డైరెక్టర్స్ కి ‘కలవలేం, కథ వినలేం’ అని చెబుతుంటాం. దానికి కొంతమంది ఫీలవుతుంటారు. అందుకు నేనేం చేయలేను. అందరినీ ఆనందంగా ఉంచేందుకు నేను బిర్యానీ కాదు. సినిమా హిట్ అయితే తలెత్తుకోవడంలో తప్పులేదు. కానీ, బాగా ఆడుతుందని చెప్పి కించపరచొద్దు. అదొక్కటి బాధగా ఉంది.” అన్నాడు.

అనంతరం.. ఆల్రెడీ ఆ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు. ముందుగా నేనే విష్ చేశా. అయినా.. మీమ్స్ లో చూస్తే.. డైరెక్టర్ ని నేను కలవలేదని వచ్చాయి. ఒక గంట విని నో చెప్పడం కంటే.. ముందే చెప్పడం బెటర్ అని నేను అనుకున్నా’ అని చెప్పుకొచ్చాడు. అయితే.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బేబీ డైరెక్టర్.. ఓ హీరో తన కథ వినడానికి కూడా ఆసక్తి చూపలేదని తెలిపాడు. అదే టైంలో విశ్వక్ ట్వీట్ వేసాడు. డైరెక్టర్ ని పాయింట్ చేస్తూ విశ్వక్ ట్వీట్ వేశాడంటూ.. వివాదం రాజుకుంది. తాజాగా విశ్వక్ చెప్పిన మాటలపై నెటిజన్స్ బూతులు జోడించి మరి కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజెన్ కామెంట్ కి హీరో విశ్వక్ కూడా రెస్పాండ్ అవ్వడం విశేషం. మరి ఈ కాంట్రవర్సీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişmeritbetcasibomJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetgar girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel