iDreamPost
android-app
ios-app

వీడియో: సోహెల్ వ్యాఖ్యలకు.. నవీన్ పూలచొక్కా స్ట్రాంగ్ కౌంటర్!

  • Published Feb 05, 2024 | 7:51 PM Updated Updated Feb 05, 2024 | 7:51 PM

Sohel vs Naveen PoolaChokka: నవీన్ పూలచొక్కా- సోహెల్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా నవీన్ సోహెల్ కు కౌంటర్ ఇచ్చాడు.

Sohel vs Naveen PoolaChokka: నవీన్ పూలచొక్కా- సోహెల్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా నవీన్ సోహెల్ కు కౌంటర్ ఇచ్చాడు.

  • Published Feb 05, 2024 | 7:51 PMUpdated Feb 05, 2024 | 7:51 PM
వీడియో: సోహెల్ వ్యాఖ్యలకు.. నవీన్ పూలచొక్కా స్ట్రాంగ్ కౌంటర్!

బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ నటించిన బూట్ కట్ బాలరాజు చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. తన సినిమాకి జనాలు రావడం లేదంటూ సోహెల్ బహిరంగంగానే ఏడుస్తూ ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. అలాగే తన సినిమా గురించి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్, వీడియోలు, మీమ్స్ కు కూడా స్వయంగా రిప్లయ్ ఇస్తున్నాడు. ఆ క్రమంలోనే సోషల్ మీడియా ఇన్ ఫ్లున్సర్ నవీన్ పూలచొక్కా రివ్యూ వీడియోకి కూడా రెస్పాండ్ అయ్యాడు. తన సినిమాకి 0.45 టమాలు ఇవ్వండపై అసహనం వ్యక్తం చేశాడు. దానిని నవీన్ కూడా డీటెయిల్డ్ గా రిప్లయ్ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ లో నవీన్ గురించి సోహెల్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. వాటికి తాజాగా నవీన్ పూలచొక్కా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వీడియో రిలీజ్ చేశాడు.

సోహెల్ తనని వాడు, వీడు అంటూ అమర్యాదగా సంబోధించడంపై నవీన్ పూలచొక్కా ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను ఎవరినీ అమర్యాదగా పిలవను అంటూ క్లారిటీ ఇచ్చాడు. కౌంటర్ వీడియోలో కూడా సౌహెల్ ని గారు, మీరు అంటూనే పిలిచాడు. నవీన్ పూలచొక్కా రివ్యూలకు టమోటోలు ఇస్తాడని అందరికీ తెలిసిందే. ఆ టమోటో కాన్సెప్ట్ ని కూడా సోహెల్ హేళన చేయడంపై నవీన్ సమాధానం చెప్పాడు. తనని టమాటాలు అమ్ముకునే మొఖంలా ఉంటుంది అన్న కామెంట్ కు.. “వచ్చే జన్మలో టామ్ క్రూజ్ గానో, మహేశ్ బాబులాగానే పుడతాను. ఈ జన్మకు ఏమనుకోకు సారీ” అంటూ ఎద్దేవా చేశాడు.

ఇంకా ఎన్నాళ్లు ఇలా బాడీ షేమింగ్ చేస్తారంటూ నవీన్ ప్రశ్నించాడు. తనని అగౌరవ పరచడంపై తాను కూడా సిపంథీ కార్డ్ ప్లే చేయచ్చని, తాను కూడా విక్టిమ్ లో వీడియో పెట్టచ్చని చెప్పాడు. కానీ, అది తనకి ఇష్టం లేదంటూ నవీన్ క్లారిటీ ఇచ్చాడు. గతంలో సోహెల్ చేసిన మిస్టర్ ప్రెగ్నెంట్ కి 2 టమాటాలు ఇచ్చి.. ఇప్పుడు 0.45 టమాటాలు ఇవ్వడం ఏంటని సోహెల్ వేసిన ప్రశ్నకు నవీన్ పూలచొక్కా తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చాడు. “మిస్టర్ ప్రెగ్నెంట్ కి 2 టమాటాలు ఇచ్చి.. ఇప్పుడు 0.45 టమాటాలు ఇవ్వడం ఏంటని అడగడంలోనే మీ ఇమ్మెచ్యూరిటీ అర్థమవుతోంది. మీరు నా వీడియోకి పెట్టిన కామెంట్ పిన్ చేశాను. పైగా క్లియర్ గా సమాధానం కూడా చెప్పాను. మీ కామెంట్ కన్నా నా కామెంట్ కి ఎక్కువ లైక్స్ రాగానే మీ కామెంట్ ని డిలీట్ చేశారు. ఎవరితోనో పోల్చి నాకు రివ్యూ ఇచ్చే అర్హత లేదు అంటున్నారు. నేను ఆరేళ్లు సినిమా ఇండస్ట్రీలో పని చేశాను. అసిసోయేట్ డైరెక్టర్ గా చేశా, నాకు సినిమా ఎడిటింగ్ కూడా వచ్చు, యాక్టర్స్ తో డైలాగులు కూడా చెప్పించా, నేను వీఎఫ్ఎక్స్ వారితో కూడా కోఆర్డినేట్ అయ్యాను. అవును రివ్యూ చేయడానికి నేనే తోపు.

మీరు సినిమాల్లో లేకపోతే ఇంకోలా ఉండేది అంటున్నారు. ఏంటి ధమ్మీ ఇస్తున్నారా? మీరు సినిమాల్లో ఉన్నారు కాబట్టే నేను మీ గురించి మాట్లాడుతున్నాను. లేదంటే తూ కౌన్ మే కౌన్ అనేలా ఉండేవాడిని. నేను వీజే సన్నీ సినిమాకి కూడా తక్కువ రేటింగ్ ఇచ్చాను. ఒకసారి కలిసినప్పుడు సన్నీ అది నీ అభిప్రాయం నేను రెస్పెక్ట్ చేస్తాను అని చెప్పాడు. నా రివ్యూస్ కి ఇండస్ట్రీలో చాలా మంది రెస్పెక్ట్ ఇస్తారు” అంటూ నవీన్ పూలచొక్కా సోహెల్ వ్యాఖ్యలకు పాయింట్ పై పాయింట్ ఆన్సర్ చెప్పాడు. అంతేకాకుండా తాను గతంలో కూడా సోహెల్ కి సపోర్ట్ చేశాడని.. భవిష్యత్ లో కూడా సపోర్ట్ చేస్తాను అంటూ నవీన్ పూలచొక్కా చెప్పాడు. మరి.. సోహెల్- నవీన్ పూలచొక్కా మధ్య జరుగుతున్న ఈ డైలాగ్ వార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomjojobetcasibomsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş