iDreamPost
android-app
ios-app

షారూఖ్ ఖాన్‌ని బీట్ చేస్తూ..IMDB లిస్ట్‌లోకి దూసుకొచ్చిన శోభిత ధూళిపాళ!

  • Published Aug 13, 2024 | 12:39 PM Updated Updated Aug 13, 2024 | 12:39 PM

Sobhita Dhulipala: సినీ ఇండస్ట్రీలో ఐశ్వర్య రాయ్ మొదలు శోభితా దూళిపాళ్ల వరకు ఎంతోమంది స్టార్ హీరోయిన్లు మొదట మోడల్ గా తమ కెరీర్ ప్రారంభించిన వారే. ఇటీవల సోషల్ మీడియాలో నటి శోభితా దూళిపాళ్ళ పేరు బాగా వినిపిస్తుంది. తాజాగా శోభితకు అరుదైన గౌరవం దక్కింది.

Sobhita Dhulipala: సినీ ఇండస్ట్రీలో ఐశ్వర్య రాయ్ మొదలు శోభితా దూళిపాళ్ల వరకు ఎంతోమంది స్టార్ హీరోయిన్లు మొదట మోడల్ గా తమ కెరీర్ ప్రారంభించిన వారే. ఇటీవల సోషల్ మీడియాలో నటి శోభితా దూళిపాళ్ళ పేరు బాగా వినిపిస్తుంది. తాజాగా శోభితకు అరుదైన గౌరవం దక్కింది.

  • Published Aug 13, 2024 | 12:39 PMUpdated Aug 13, 2024 | 12:39 PM
షారూఖ్ ఖాన్‌ని బీట్ చేస్తూ..IMDB లిస్ట్‌లోకి దూసుకొచ్చిన  శోభిత ధూళిపాళ!

నటి శోభితా ధూళిపాళ్ల అచ్చమైన తెలుగుమ్మాయి. మోడల్ గా కెరీర ప్రారంభించి 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం దక్కించుకుంది. అదే ఏడాది మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారత్ తరుపున పాల్గొంది.భారత సంప్రదాయ నృత్యాలైన భరత నాట్యం, కూచిపూడి శిక్షణ తీసుకొని పలు ప్రదర్శనలు ఇచ్చింది. రామన్ రాఘవ్ 2.0 మూవీతో బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టింది. తెలుగులో గూఢాచారి, మేజర్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఇటీవల కింగ్ నాగార్జున తనయుడు నాగ చైతన్యతో నిశ్చితార్థం జరిగింది. తాజాగా శోభితా దూళిపాళ్లకు అరుదైన గౌరవం దక్కింది. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ (IMDb) దేశంలో ఎంతో గొప్ప పాపులారిటీ సంపాదించింది. తాజాగా ఐఎండీబీ రిలీజ్ చేసిన ప్రముఖ భారతీయ సెలబ్రెటీల లిస్ట్‌లో నటి శోభిత దూళిపాళ్ల టాప్ 2 లో నిలిచారు. ‘ముంజ్యా’ నటి శార్వరి వాఘ్ మరోసారి అగ్రస్థానంలో నిలుపుకుంది.బాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాంగ్ షారూక్ ఖాన్ ని వెనక్కి నెట్టి శోభిత రెండో స్థానంలోకి రావడం విశేషం. ఈ లిస్టులో షారూక్ ఖాన్, కాజోల్, జాన్వీ కపూర్ వరుసగా టాప్ 5 లో ఉన్నారు.మోడల్ గా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో ఎక్కడ  చూసినా నటి శోభితా ధూళిపాళ్ల పేరు బాగా వినిపిస్తుంది.

2021లో సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత 2022 నుంచి శోభితతో చైతూ డేటింగ్ చేస్తున్నాడు. 2023లో లండన్ కు ఇద్దరూ కలిసి వెళ్లారు.. అక్కడ ఓ హోటల్‌లో ఇద్దరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి వీరిద్దరపై రక రకాల కథనాలు వెలువడ్డాయి.అన్ని రూమర్లకు చెక్ పెడుతూ ఆగస్టు 8 న హైదరాబాద్‌లో ఇరువురి కుటుంబ పెద్దల సమక్షంలో శోభిత- చైతూ నిశ్చితార్థం జరిగింది. పెళ్లి డేట్ మాత్రం ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ మెట్ చేయలేదు. ఎంగేజ్‌మెంట్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. మొత్తానికి 2024 లో శోభితకు బాగా కలిసి వస్తుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet