Swetha
సందీప్ రెడ్డి వంగ నుంచి సినిమా వస్తుందంటే అది కచ్చితంగా భారీ సినిమా అయ్యి ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోతారు. అర్జున్ రెడ్డి తో అలాంటి మార్క్ సెట్ చేసుకున్నాడు సందీప్. ఆ తర్వాత హిందీ లో కబీర్ సింగ్ నెక్స్ట్ యానిమల్ తో అతని రేంజ్ అంతకంతకు పెరిగిపోయింది.
సందీప్ రెడ్డి వంగ నుంచి సినిమా వస్తుందంటే అది కచ్చితంగా భారీ సినిమా అయ్యి ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోతారు. అర్జున్ రెడ్డి తో అలాంటి మార్క్ సెట్ చేసుకున్నాడు సందీప్. ఆ తర్వాత హిందీ లో కబీర్ సింగ్ నెక్స్ట్ యానిమల్ తో అతని రేంజ్ అంతకంతకు పెరిగిపోయింది.
Swetha
సందీప్ రెడ్డి వంగ నుంచి సినిమా వస్తుందంటే అది కచ్చితంగా భారీ సినిమా అయ్యి ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోతారు. అర్జున్ రెడ్డి తో అలాంటి మార్క్ సెట్ చేసుకున్నాడు సందీప్. ఆ తర్వాత హిందీ లో కబీర్ సింగ్ నెక్స్ట్ యానిమల్ తో అతని రేంజ్ అంతకంతకు పెరిగిపోయింది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘స్పిరిట్’ సినిమా తీయబోతున్నాడు . అది ఎంత భారీగా ఉంటుందో ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. అయితే ఇలాంటి పెద్ద సినిమాలతో పాటు సందీప్ ఓ చిన్న సినిమా కూడ తీయబోతున్నాడు.
అయితే ఈ చిన్న సినిమాకు ఇతను దర్శకుడు కాదు నిర్మాత. తన మొదటి అర్జున్ రెడ్డి తో మొదలుపెట్టిన భద్రకాళి ఫిలిమ్స్ బేనర్ మీద సందీప్ కొత్త తీయబోతున్నాడు. ఈ సినిమాలో 8 వసంతాలు తో మంచి పేరు సంపాదించిన మలయాళ హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ హీరోయిన్ గా నటించనుంది. ఈసారి తెలంగాణ బ్యాక్డ్రాప్ లో ఈ నటి నటించబోతుంది. ఇక ఈ సినిమాలో మేం ఫేమస్’ ఫేమ్ సుమంత్ అశ్విన్ హీరోగా నటించనున్నాడు.
అలాగే ఈ సినిమాకు వేణు అనే ఓ కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్నాడు. ఇక్కడ నెగిటివితో తెరకెక్కే కథలను సందీప్ ప్రాధాన్యత ఇస్తూ సపోర్ట్ చేస్తున్నాడు. పొట్టెల్ లాంటి సినిమాలకు కూడా అతను సాయం అందించాడు. ఇలాంటి సినిమాలకు తన నిర్మాణ సంస్థ నుంచి సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఇది కనుక సక్సెస్ అయితే సందీప్ బ్యానర్ నుంచి మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.