iDreamPost
android-app
ios-app

Sardar 2: కార్తీని ఢీ కొడుతున్న మహేశ్ విలన్! సర్దార్ 2లో క్రేజీ స్టార్..

  • Published Jul 16, 2024 | 5:59 PM Updated Updated Jul 16, 2024 | 5:59 PM

సర్దార్ 2లో కార్తీని ఢీ కొట్టేందుకు మహేశ్ విలన్ని బరిలోకి దించుతున్నాడు మిత్రన్. మరి ఆ క్రేజీ స్టార్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

సర్దార్ 2లో కార్తీని ఢీ కొట్టేందుకు మహేశ్ విలన్ని బరిలోకి దించుతున్నాడు మిత్రన్. మరి ఆ క్రేజీ స్టార్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

  • Published Jul 16, 2024 | 5:59 PMUpdated Jul 16, 2024 | 5:59 PM
Sardar 2: కార్తీని ఢీ కొడుతున్న మహేశ్ విలన్! సర్దార్ 2లో క్రేజీ స్టార్..

‘సర్దార్’.. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ డైరెక్షన్ లో 2022లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మూవీ లవర్స్ నుంచి సినీ విమర్శకుల వరకు మెప్పించింది ఈ చిత్రం. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించినప్పటి నుంచి సీక్వెల్ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. క్లైమాక్స్ లోనే సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చిన దర్శకుడు.. తాజాగా సర్దార్ 2ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక పార్ట్ 2లో కార్తీని ఢీ కొట్టేందుకు మహేశ్ విలన్ని బరిలోకి దించుతున్నాడు మిత్రన్. మరి ఆ క్రేజీ స్టార్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

కార్తీ నటించిన సూపర్ హిట్ మూవీ సర్దార్ కు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. రెగ్యూలర్ షూటింగ్ కూడా మెుదలుపెట్టారు. ఇక సర్దార్ ను మీడియం రేంజ్ లో రూపొందించిన డైరెక్టర్.. సర్దార్ 2 ను మాత్రం భారీ బడ్జెట్ తో తీయాలనుకుంటున్నాడట. అందుకోసం భారీ కాస్టింగ్ ను రంగంలోకి దించుతున్నాడు. ఇక ఈ మూవీలో విలన్ పాత్రలో మెరవబోతున్నాడు విలక్షణ నటుడు కమ్ డైరెక్టర్ ఎస్ జే సూర్య.

తాజాగా సర్దార్ 2 మూవీ షూట్ లో జాయిన్ అయ్యాడు ఎస్ జే సూర్య. దాంతో కార్తీకి పోటీ ఇచ్చే విలన్ పాత్రలో సూర్యను చూడబోతున్నాం అంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇదిలా ఉండగా.. డైరెక్టర్ గా ఎన్నో హిట్స్ అందుకుని, ఇప్పుడు యాక్టర్ గా ఫుల్ బిజీగా మారిపోయాడు. వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ లో కూడా నటిస్తున్నాడు. కాగా.. స్పై థ్రిల్లర్ సీక్వెల్స్ కు మంచి డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్లుగానే మేకర్స్ కూడా సూపర్ హిట్ చిత్రాలకు సీక్వెల్స్ ను తీసుకొస్తున్నారు. సర్దార్ 2లో ఎస్ జే సూర్య ఏ రేంజ్ యాక్టింగ్ తో ఇరదీస్తాడో వేచి చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş