iDreamPost
android-app
ios-app

Double Ismart Maar Muntha Song: డబుల్ ఇస్మార్ట్ నుండి మార్ ముంత సాంగ్ రిలీజ్! KCR డైలాగ్ హైలెట్!

  • Published Jul 16, 2024 | 5:24 PM Updated Updated Jul 16, 2024 | 5:24 PM

డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ను విడుదల చేశారు మేకర్స్. 'మార్ ముంతా.. చోడ్ చింతా' అంటూ సాగే ఈ మాస్ బీట్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ పాటలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫేమస్ డైలాగ్ హైలెట్ గా నిలిచింది.

డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ను విడుదల చేశారు మేకర్స్. 'మార్ ముంతా.. చోడ్ చింతా' అంటూ సాగే ఈ మాస్ బీట్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ పాటలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫేమస్ డైలాగ్ హైలెట్ గా నిలిచింది.

  • Published Jul 16, 2024 | 5:24 PMUpdated Jul 16, 2024 | 5:24 PM
Double Ismart Maar Muntha Song: డబుల్ ఇస్మార్ట్ నుండి మార్ ముంత సాంగ్ రిలీజ్! KCR డైలాగ్ హైలెట్!

టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. ఇందులో రామ్ కు జోడీగా కావ్య థాపర్ నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సాధించిన విజయంతో.. డబుల్ ఇస్మార్ట్ అంటూ వస్తున్నాడు రామ్. ఇక ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘స్టెప్పా మార్’  ఏ రేంజ్ లో బ్లాస్ట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ ను విడుదల చేశారు మేకర్స్. ‘మార్ ముంతా.. చోడ్ చింతా’ అంటూ సాగే ఈ మాస్ బీట్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ పాటలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫేమస్ డైలాగ్ హైలెట్ గా నిలిచింది.

‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ నుంచి ‘మార్ ముంతా.. చోడ్ చింతా’ అనే మాస్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మణిశర్మ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్ సాంగ్ సాలిడ్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు. కాసర్ల శ్యామ్ అందించిన మాస్ లిరిక్స్ కు రామ్-కావ్య థాపర్ ల స్టెప్పులు అదిరిపోయాయి. కావ్య గ్లామర్ షో కుర్రాళ్లకు కిక్కెక్కిస్తుంది. ఇక విజయ్ పోలంకి కొరియోగ్రఫీ ఆకట్టుకుంది. రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, కీర్తనా శర్మ తమ గొంతుతో సాంగ్ ను వేరే రేంజ్ కు తీసుకెళ్లారు. స్టెప్పా మార్ కంటే హై రేంజ్ లో ఈ సాంగ్ చాట్ బస్టర్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాటలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫేమస్ డైలాగ్ గురించే. ‘ఏం జేద్దామంటవ్ మరి’ అన్న కేసీఆర్ ఫేమస్ డైలాగ్ ను ఈ సాంగ్ లో వాడిన తీరు అద్భుతమనే చెప్పాలి.

రామ్ పోతినేని-కావ్య థాపర్ జంటగా నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఇక డబుల్ ఇస్మార్ట్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. ఈ మూవీతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు పూరి జగన్నాథ్. మరి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ దద్దరిల్లిపోగా.. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి మార్ ముంతా.. చోడ్ చింతా సాంగ్ ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio