iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్.. నిలిచిపోయిన శివకార్తికేయన్ మూవీ రిలీజ్! అసలేం జరిగింది?

  • Author ajaykrishna Updated - 12:05 PM, Fri - 14 July 23
  • Author ajaykrishna Updated - 12:05 PM, Fri - 14 July 23
బ్రేకింగ్.. నిలిచిపోయిన శివకార్తికేయన్ మూవీ రిలీజ్! అసలేం జరిగింది?

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. పేరుకు తమిళ హీరో అయినప్పటికీ.. రెమో, కాలేజ్ డాన్, డాక్టర్ లాంటి సినిమాలతో తెలుగులోను మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. అందుకే తాను చేసే ప్రతీ సినిమాను తమిళంతో తెలుగులోను ఒకేసారి రిలీజ్ చేస్తుంటాడు. శివకార్తికేయన్ చివరిగా తెలుగు డైరెక్టర్ అనుదీప్ తో ప్రిన్స్ మూవీ చేశాడు. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. తాను చేసిన కొత్త సినిమాను రిలీజ్ కి రెడీ చేశాడు. తమిళంలో ‘మావీరన్’గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో మహావీరుడు పేరుతో రిలీజ్ ప్లాన్ చేశారు.

ఇక నిన్న మొన్నటిదాకా ప్రమోషన్స్ గట్టిగా జరుపుకున్న ఈ సినిమా.. జులై 14న అంటే ఈరోజే వరల్డ్ వైడ్ రిలీజ్ కావాల్సింది. తమిళంతో పాటు తెలుగు భాషలో భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ.. రిలీజ్ కి ఇంకొన్ని గంటల సమయం ఉందనగా.. మూవీకి సంబంధించి షాకింగ్ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన మహావీరుడు.. తీరా టైంకి రిలీజ్ నిలిచిపోయినట్లు సమాచారం. మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఆల్రెడీ ఈ సినిమా రిలీజ్ కోసం అటు తమిళ ఫ్యాన్స్.. ఇటు తెలుగు ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు. అందులోనూ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే నమోదు అయ్యాయి.

కట్ చేస్తే.. తమిళంతో పాటు తెలుగు వెర్షన్ రిలీజ్ కూడా ఆగిపోయిందని తెలుస్తోంది. మరి ఎందుకు నిలిచిపోయిందనే వివరాల్లోకి వెళ్తే.. మహావీరుడు మూవీకి సంబంధించి అన్ని కరెక్ట్ గానే ఉన్నప్పటికీ.. కంటెంట్ డెలివరీ ఆలస్యం కావడంతో ఆగిపోయిందని ఇండస్ట్రీ టాక్. తెలుగు రిలీజ్ తో పాటు.. యూఎస్ లోను తమిళ, తెలుగు వెర్షన్స్ విడుదల నిలిచిపోయిందట. ప్రస్తుతం మేకర్స్ సినిమా రిలీజ్ కి సంబంధించి ప్రాబ్లెమ్స్ అన్ని సార్ట్ అవుట్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి మేకర్స్ మళ్లీ మహావీరుడు రిలీజ్ కి కొత్త డేట్ అనౌన్స్ చేస్తారా లేక ఈవెనింగ్ లోపు అన్ని సెట్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. మరి శివకార్తికేయన్ మూవీకి ఇలా జరగడం ఏంటని ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. మరి మహావీరుడు మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.