iDreamPost
android-app
ios-app

అమీర్ ఖాన్ సినిమా OTT లో కాదట !

  • Published Jul 30, 2025 | 10:32 AM Updated Updated Jul 30, 2025 | 10:32 AM

తారే జమీన్ పర్ సినిమా అప్పట్లో ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఇంప్రెస్స్ చేసింది. చాలా మందికి ఈ సినిమా ఓ నోస్టాలజియా అని చెప్పొచ్చు. దీనితో ఇన్నేళ్ల తర్వాత అదే అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమాను అనౌన్స్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమా మీద ఎక్కడలేని అంచనాలు పెట్టుకున్నారు.

తారే జమీన్ పర్ సినిమా అప్పట్లో ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఇంప్రెస్స్ చేసింది. చాలా మందికి ఈ సినిమా ఓ నోస్టాలజియా అని చెప్పొచ్చు. దీనితో ఇన్నేళ్ల తర్వాత అదే అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమాను అనౌన్స్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమా మీద ఎక్కడలేని అంచనాలు పెట్టుకున్నారు.

  • Published Jul 30, 2025 | 10:32 AMUpdated Jul 30, 2025 | 10:32 AM
అమీర్ ఖాన్ సినిమా OTT లో కాదట !

తారే జమీన్ పర్ సినిమా అప్పట్లో ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఇంప్రెస్స్ చేసింది. చాలా మందికి ఈ సినిమా ఓ నోస్టాలజియా అని చెప్పొచ్చు. దీనితో ఇన్నేళ్ల తర్వాత అదే అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమాను అనౌన్స్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమా మీద ఎక్కడలేని అంచనాలు పెట్టుకున్నారు. గత నెల 20 న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. తారే జమీన్ పర్ రేంజ్ రెస్పాన్స్ కాకపోయిన సినిమాకు మంచి రెస్పాన్స్ ఏ దక్కింది. అయితే ఈ సినిమా ఓటిటి విషయంలో అమీర్ అప్పట్లో ఎలాంటి వ్యాఖ్యలు చేసారో తెలియనిది కాదు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు కావొస్తుంది కాబట్టి.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ దగ్గరపడింది.

సుమారు రూ.70 నుంచి 90 కోట్ల బ‌డ్జెట్‌లో రూపొందించిన ఈ సినిమా.. థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యేలోపు దాదాపు రూ.300 కోట్లు రాబ‌ట్టింది ఈ మూవీ. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుంది. డిజిటల్ స్ట్రీమింగ్ అంటే ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ కాదట. నేరుగా ఈ సినిమా యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఇలాంటి కొత్త సంప్రదాయానికి నడుం బిగించి అమీర్ ఖాన్ సాహసం చేశాడని చెప్పి తీరాలి. ఆగష్టు 1 నుంచి ఈ మూవీ యూట్యూబ్ లో హిందీతో పాటు తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది. అయితే యూట్యూబ్ ఏ కదా అని ఫ్రీ గా చూడాలని అనుకుంటే అది భ్రమే.. ఎవరైనా ఈ సినిమాను చూడాలని అనుకుంటే రూ. 100 చెల్లించి చూడాల్సి ఉంటుందట . మరి డిజిటల్ స్ట్రీమింగ్ లో ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.