Sitara Ghattamaneni: చాలా సార్లు నాన్న వల్ల స్కూల్ బంక్ కొట్టాల్సి వచ్చింది: సితార

Sitara Ghattamaneni About Her Father Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తనయురాలు సితార ఘట్టమనేని ఐడ్రీమ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చాలా సందర్భాల్లో తండ్రి వల్ల స్కూల్ మానేయాల్సి వచ్చిందని సితార చెప్పుకొచ్చింది.

Sitara Ghattamaneni About Her Father Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తనయురాలు సితార ఘట్టమనేని ఐడ్రీమ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చాలా సందర్భాల్లో తండ్రి వల్ల స్కూల్ మానేయాల్సి వచ్చిందని సితార చెప్పుకొచ్చింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల పరంగా ఎంత పెద్ద హీరోనో.. నిజ జీవితంలో కూడా అంతే పెద్ద హీరో. తన సంపాదనలో ఎక్కువ శాతం సేవా కార్యక్రమాలకు, చిన్న పిల్లల గుండె ఆపరేషన్లకు ఖర్చు పెడుతూ మంచి మనసున్న మారాజుగా, శ్రీమంతుడిగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తనలోని లక్షణాలనే తన పిల్లలకు కూడా వారసత్వంగా అందిస్తున్నారు. పిల్లలను ఎలా పెంచాలో అనేది ఘట్టమనేని కుటుంబం చెబుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ల గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి తెలియని వారు ఉండరు. చిన్న వయసులోనే తండ్రిలోని నటనను, మంచితనాన్ని వారసత్వంగా తీసుకుంది. స్కూల్ బ్యాగులు మోసే వయసులో అంతకంటే బరువైన బాధ్యతలను మోస్తుంది.

తన తోటి పిల్లల అవసరాలు తీరుస్తుంది. తన స్థాయి పిల్లలతో కలిసి ఆడుకోవాల్సిన వయసులో స్థాయి మరచి తన వయసు పిల్లలను ఆదుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబుల వ్యక్తిత్వాన్ని, దాతృత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది. స్టార్ కిడ్ అయినప్పటికీ డౌన్ టూ ఎర్త్ ఉండడం అనేది సితారకే చెల్లింది. ఒక పక్క యాక్టింగ్ నేర్చుకుంటూ.. యాడ్స్ లో నటిస్తూ.. మరోపక్క చదువుకుంటూ.. రెగ్యులర్ గా సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది. అయితే ఎంత స్టార్ కిడ్ అయినా కూడా తాను కూడా అందరిలానే సాధారణ మనిషినే అని చెబుతుంది. కొంతమందికి మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉండదు.

అలానే తనకు కూడా మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండదని.. హిస్టరీ, ఇంగ్లీష్ అంటే ఆసక్తి అని చెప్పుకొచ్చింది. అంతేకాదు మిగతా విద్యార్థుల్లానే సితార కూడా స్కూల్ బంక్ కొడుతుంది. కాకపోతే తాను స్కూల్ బంక్ కొట్టడానికి కారణం తండ్రి మహేష్ బాబే అని ఆమె చెప్పుకొచ్చింది. తాజాగా ఐడ్రీమ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇంట్లో అమ్మ స్ట్రిక్ట్ ఆ? నాన్న స్ట్రిక్ట్ ఆ అని అడిగితే.. అమ్మ చాలా స్ట్రిక్ట్ అని చెప్పుకొచ్చింది. నాన్న తనను పాంపర్ చేస్తారని.. అంత స్ట్రిక్ట్ గా ఉండరని చెప్పుకొచ్చింది. ఎప్పుడైనా స్కూల్ బంకు కొట్టావా అని అడిగితే నాన్న వల్లే బంకు కొట్టేదాన్ని అని చెప్పుకొచ్చింది. నాన్నకి షూటింగ్ లేని సమయంలో సితారను స్కూల్ మానిపించేయమని అమ్మని ఒప్పించేవారని సితార తెలిపింది. అలా తాను స్కూల్ బంక్ కొట్టేదాన్నని చెప్పుకొచ్చింది. అయితే దీన్ని చాలా గొప్పగా ఫీలయ్యేదాన్నని.. చాలా లవ్లీ మూమెంట్ అని సితార చెప్పుకొచ్చింది.

Show comments