iDreamPost
android-app
ios-app

వీడియో: మహేశ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కెరీర్ పై సితార ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Aug 23, 2024 | 7:44 PM Updated Updated Aug 23, 2024 | 7:44 PM

Sitara Ghattamaneni On Her Acting Exams: సితార ఘట్టమనేని హీరోయిగా మారుతుందా? అనే ప్రశ్న ఎప్పటి నుంచో ఉంది. నిజానికి ఆ ప్రశ్న ఇప్పుడు అప్రస్తుతం అయినా కూడా ఫ్యాన్స్ తరచూ అడుగుతూనే ఉంటారు. ఆ ప్రశ్నకు సితారనే స్వయంగా సమాధానం చెప్పింది.

Sitara Ghattamaneni On Her Acting Exams: సితార ఘట్టమనేని హీరోయిగా మారుతుందా? అనే ప్రశ్న ఎప్పటి నుంచో ఉంది. నిజానికి ఆ ప్రశ్న ఇప్పుడు అప్రస్తుతం అయినా కూడా ఫ్యాన్స్ తరచూ అడుగుతూనే ఉంటారు. ఆ ప్రశ్నకు సితారనే స్వయంగా సమాధానం చెప్పింది.

  • Published Aug 23, 2024 | 7:44 PMUpdated Aug 23, 2024 | 7:44 PM
వీడియో: మహేశ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కెరీర్ పై సితార ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. కానీ, కొంతమంది మీదే ఫ్యాన్స్ కావచ్చు, తెలుగు ప్రేక్షకులు కావచ్చు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆ లిస్ట్ లో సితార ఘట్టమనేని పేరు టాప్ లో ఉంటుంది. సితార స్టార్ కిడ్ అయినప్పటికీ ఎంతో డౌన్ టూ ఎర్త్ ఉంటుంది. ఫ్యాన్స్ ని కలవడం, వారితో మాట్లాడటం, ఫ్యాన్స్ కి సెల్ఫీలు ఇవ్వడం తనకి ఎంతో ఇష్టం. అలాగే తండ్రి మహేశ్ బాబు తరహాలోనే సేవా కార్యక్రమాల్లో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సితార టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెడుతుందా? అనే ప్రశ్న ఎప్పటి నుంచో ఉంది. నిజానికి అందుకు చాలా సమయమే ఉన్నా.. ఆ ప్రశ్న మాత్రం తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఆ విషయంపై సితార తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఐడ్రీమ్ మీడియాకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో తన కెరీర్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.

సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. తనకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే డ్యాన్స్ కూడా నేర్చుకుంటోంది. తాను ఒక జ్యూవెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా కూడా చేసింది. ఇవన్నీ చూసిన తర్వాత మహేశ్ ఫ్యాన్స్ కచ్చితంగా ఈ ప్రశ్న అడుగుతూనే ఉంటారు. సితార హీరోయిన్ అవుతుందా? ఈ ప్రశ్నకు సితారనే స్వయంగా సమాధానం చెప్పింది. తాను కచ్చితంగా హీరోయిన్ గా మారే అవకాశాలు ఉన్నాయనే చెప్పుకొచ్చింది. తనకు కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. కానీ, ఎక్కడో ఒక చిన్న అనుమానం కూడా వ్యక్త పరిచింది. చివరికి మాత్రం తాను యాక్టింగ్ క్లాసెస్ కి వెళ్తున్న విషయాన్ని వెల్లడించింది.

good news for mahesh babu fans

“నేను యాక్టింగ్ క్లాసెస్ కి వెళ్తున్నాను. నేను యాక్టింగ్ ఎగ్జామ్స్ కూడా అటెండ్ అయ్యాను. నేను లండన్ లో యాక్టింగ్ ఎగ్జామ్స్ కి వెళ్లొచ్చాను. అలాగే ఢిల్లీలో కూడా యాక్టింగ్ ఎగ్జామ్స్ లో పాల్గొన్నాను. యాక్టింగ్ ఎగ్జామ్స్ లో నాకు 200కు గానూ.. 194 మార్కులు వచ్చాయి” అంటూ సితార అసలు విషయాన్ని చెప్పేసింది. అంటే సితారకు కూడా యాక్టింగ్ అంటే ఆసక్తి ఉంది. అందుకు సంబంధించి తాను యాక్టింగ్ ఎగ్జామ్స్ కూడా అటెండ్ అయ్యింది. 200కి 194 మార్కులు అంటే అది అస్సలు చిన్న విషయం కాదు. అలాగే లండన్ లాంటి చోట యాక్టింగ్ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి ఇంత మంచి మార్కులు సాధించడం మహేశ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

సితార ఘట్టమనేని యాక్టింగ్ ని కెరీర్ గా ఎంచుకునే అవకాశాలు అయితే ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది. యాక్టింగ్ కాకుండా నీకు ఇంకా అకెడమిక్స్ వైపు ఏమైనా ఇంట్రెస్ట్స్ ఉన్నాయా అంటే.. తనకు మ్యాథ్స్ అంటే అస్సలు ఇష్టం లేదని చెప్పింది. హిస్టరీ, ఇంగ్లీష్ అంటే తనకు చాలా ఇష్టం అనే విషయాన్ని వెల్లడించింది. ఎక్కువ శాతం నటిగా మారేందుకే ఆస్కారం ఉంది అన్నట్లుగా సితార చెప్పడం.. ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. సితార ఘట్టమనేని హీరోయిన్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కింది వీడియోలో సితార ఘట్టమనేని ఫుల్ ఇంటర్వ్యూ చూసేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio