iDreamPost
android-app
ios-app

మిస్టర్ బచ్చన్ నుంచి వచ్చేసిన సితార్ సాంగ్.. క్లాసిక్ టచ్ తో వైరల్ స్టఫ్!

  • Published Jul 10, 2024 | 11:55 AM Updated Updated Jul 10, 2024 | 11:55 AM

Sitar Song From Mr Bachchan Out Now: రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి సితార్ సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతాయి అనడంలో సందేహం లేదు.

Sitar Song From Mr Bachchan Out Now: రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి సితార్ సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతాయి అనడంలో సందేహం లేదు.

  • Published Jul 10, 2024 | 11:55 AMUpdated Jul 10, 2024 | 11:55 AM
మిస్టర్ బచ్చన్ నుంచి వచ్చేసిన సితార్ సాంగ్.. క్లాసిక్ టచ్ తో వైరల్ స్టఫ్!

మాస్ మహరాజ్ రవితేజ గురించి సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు ఏమీ అక్కర్లేదు. సొంత స్టామినా మీద ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా.. తనలాంటి ఎంతో మందికి ఒక పిల్లర్ లా నిలబడ్డాడు. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అంటూ రవితేజ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని పీపుల్ మూవీ ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ ని రీలీజ్ చేశారు. ఆ పాటకు సితార్ సాంగ్ అని పేరు పెట్టారు. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేయడానికి రెడీ అయిపోయింది.

సాధారణంగానే రవితేజ ఎనర్జీ అంటే అటు అభిమానులకే కాకుండా.. మేకర్స్, డైరెక్టర్స్, శేఖర్ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్స్ కి బాగా ఇష్టం. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ ఎనర్జీ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఈ సితార్ సాంగ్ లో కూడా మాస్ మహరాజ ఎనర్జీని అదే రేంజ్ లో చూడచ్చు. రవితేజ పక్కన హీరోయిన్ భాగ్యశ్రీ కూడా పర్ఫెక్ట్ జోడీ అన్నట్లు మ్యాచ్ అయిపోయింది. ఇంక ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ కచ్చితంగా ఇండస్ట్రీలోనే కాదు.. రీల్స్ లో కూడా ఇక నుంచి బాగా చూస్తారు. అలాగే మిక్కీ జే మేయర్స్ మ్యూజిక్ అలరిస్తుంది. ఈ సాంగ్ లో హుక్ స్టెప్స్ ని మాత్రమే రివీల్ చేశారు. మిగతాది అంతా సాంగ్ మేకింగ్ వీడియోస్ చూపించారు. ఈ సాంగ్ మ్యూజిక్ మాత్రమే కాదు.. లిరిక్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి.

ఈ మూవీకి ఈ సాంగ్ కచ్చితంగా హెలెట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సాంగ్ లొకేషన్ కావచ్చు.. యాక్టర్స్ కాస్యూమ్స్ కావచ్చు ఎంతో ఫ్రెష్ గా ఉన్నాయి. అలాగే సాంగ్ కోసం క్రూ చాలానే కష్టపడింది అనే విషయం సాంగ్ చూస్తే అర్థమైపోతుంది. ఇంక సినిమా విషయానికి వస్తే.. రవితేజ అమితాబ్ బచ్చన్ అభిమాని అని తెలిసిందే. పైగా ఈ మూవీకి మిస్టర్ బచ్చన్ అని టైటిల్ పెట్టడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అలాగే ఈ మూవీలో కథకు తగినట్లుగా రవితేజను అమితాబ్ అభిమానిగా చూపించనున్నారు. మరి.. ఈ సితార్ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş