Dharani
శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందాడు. బుధవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశాడు. ఈ క్రమంలో అతడి రెండో పెళ్లికి సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి.
శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందాడు. బుధవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశాడు. ఈ క్రమంలో అతడి రెండో పెళ్లికి సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి.
Dharani
చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మాజీ భర్త.. శిరీష్ భరద్వాజ్ కన్ను మూసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న శిరీష్.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. కానీ బుధవారం నాటికి పరిస్థితి విషమించడంతో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే కన్ను మూశాడు. అతడి మృతి పట్ల బంధువులు, స్నేహితులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక శిరీష్, శ్రీజను ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెద్దలను ఎదిరించి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీరి వివాహం పెను సంచలనంగా మారింది. 2007లో శిరీష్, శ్రీజలు పెళ్లి ఆర్యసమాజ్‌లో జరిగింది. వీరికి ఒక కుమార్తె జన్మించింది. కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు. ఆ తర్వాత నుంచి ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి.
శిరీష్ కట్నం కోసం తనను వేధిస్తున్నాడని.. ఇబ్బంది పెడుతున్నాడని శ్రీజ ఆరోపించింది. 2012లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఆ తర్వత కొన్నాళ్లకు వీరు విడాకులు తీసుకున్నారు. 2014లో శ్రీజ-శిరీష్‌లు విడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అనగా 2019లో శిరీష్ రెండో పెళ్లి చేసుకున్నాడు. చాలా మందికి అతడు రెండో వివాహం చేసుకున్నాడని తెలియదు. ఈరోజు అతడు మృతి చెందడంతో.. శిరీష్ రెండో భార్య గురించి తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక శిరీష్.. ఓ డాక్టర్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె వివరాల విషయానికి వస్తే.. శిరీష్ రెండో పెళ్లి చేసుకున్న యువతి పేరు విహన. ఆమె స్వస్థలం హైదరాబాద్. డాక్టర్‌గా చేస్తోంది. ఇక వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు శిరీష్-వివాన చెన్నైలో నివాసం ఉన్నారు.
శ్రీజతో విడాకులు తర్వాత శిరీష్ రాజకీయాల్లోకి వచ్చాడు. బీజేపీలో చేరాడు.. కొన్నాళ్ల పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. ఆ తర్వాత అనారోగ్యం బారిన పడటంతో రాజకీయాలకు దూరమయ్యాడని తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం శిరీష్ లంగ్స్ పూర్తిగా పాడైనట్లు వైద్యులు వెల్లడించారు. అప్పటి నుంచి అతడు చికిత్స తీసుకుంటున్నాడు. తాజాగా అతడి పరిస్థితి విషమంగా మారడంతో.. ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూనే కన్ను మూశాడు. బుధవారం ఉదయం శిరీష్ మృతి చెందాడు. అయితే ఈ విషయాన్ని ముందుగా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. శిరీష్ బంధువులు, మీడియా వాళ్లు అతడి మరణ వార్తను సోషల్ మీడియా ద్వారా వెల్లడించి సంతాపం తెలిపారు.