iDreamPost
android-app
ios-app

Salaar: సలార్‌లో యశ్‌.. వైరల్‌గా మారిన సింగర్‌ వీడియో!

  • Published Dec 11, 2023 | 2:56 PM Updated Updated Dec 11, 2023 | 2:56 PM

మాలికాపురం ఫేమ్‌ తీర్థ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సలార్‌లో యశ్‌ కూడా ఉన్నాడంటూ ఆమె అన్న మాటలు ప్రభాస్‌, యశ్‌ ఫ్యాన్స్‌ను ఫుల్‌ ఖుషీ చేస్తున్నాయి...

మాలికాపురం ఫేమ్‌ తీర్థ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సలార్‌లో యశ్‌ కూడా ఉన్నాడంటూ ఆమె అన్న మాటలు ప్రభాస్‌, యశ్‌ ఫ్యాన్స్‌ను ఫుల్‌ ఖుషీ చేస్తున్నాయి...

  • Published Dec 11, 2023 | 2:56 PMUpdated Dec 11, 2023 | 2:56 PM
Salaar: సలార్‌లో యశ్‌.. వైరల్‌గా మారిన సింగర్‌ వీడియో!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం సలార్. ప్యాన్ ఇండియా రెంజ్లో తీసిన ఈ భారీ బడ్జెట్ చిత్రం త్వరలోనే థీయేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ అయ్యి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యప్తంగా విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే.. సలార్ సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇప్పుడు ఓ చిన్నారికి చెందిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఆ వివరాళ్లోకి వెళ్తే.. సలార్‌కు కేజీఎఫ్‌ సినిమాలకు మధ్య సంబంధం ఉందంటూ మొదటినుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే, కొద్దిరోజుల క్రితం దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఈ ప్రచారంపై స్పందించారు. కేజీఎఫ్‌కు, సలార్‌కు అస్సలు సంబంధం ఉండదని అన్నారు. దీంతో పుకార్లకు బ్రేక్‌ పడింది. ఇలాంటి సమయంలో సలార్‌ సినిమా గురించి ఓ చిన్నారి సింగర్‌ తీర్థ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీశాయి.

కొద్దిరోజుల క్రితం తీర్థ ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నేను కేజీఎఫ్ సినిమా చాలాసార్లు చూశాను. నాకు సలార్లో అవకాశం రాగానే. కేజీఎఫ్ టీమ్ అంటే ఏమిటి.. సలార్ సినిమా సంగీతం, సంగతుల గురించి నాన్న నాతో చెప్పారు. ప్రభాస్‌ అంకుల్‌, యశ్‌ అంకుల్‌, పృథ్వీరాజ్‌ అంకుల్‌ నటించిన సలార్‌ సినిమాలో నేను పాటలు పాడాను. మొత్తం మూడు భాషల్లో పాటలు పాడాను’’ అని తెలిపింది. ప్రస్తుతం తీర్థ సలార్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

దీంతో సలార్‌లో యశ్‌ కూడా నటించారంటూ కొంతమంది నెటిజన్లు ‍ప్రచారం చేయటం మొదలుపెట్టారు. యశ్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అయితే ఫుల్‌ ఖుషీలో మునిగిపోయారు. అయితే, తీర్థ మాటల్లో వాస్తవం లేదని తేలింది. తీర్థ చేసిన వ్యాఖ్యలపై ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘‘ సలార్ సినిమా రికార్డింగ్ మంగళూరులో జరిగింది. తీర్థ అక్కడికి వెళ్ళినప్పుడు ప్రశాంత్ నీల్, రవి బస్రూర్ తదితరులు ఉన్నారు. అయితే చాలాసార్లు కేజీఎఫ్‌ సినిమా చూసిన తీర్థ ఆ జ్ఞాపకంలోనే యశ్‌ పేరును పొరపాటున ప్రస్తావించింది.

ఈ చిత్రానికి సంగీత బృందం మొత్తం కేజీఎఫ్‌కు చెందిన వాళ్లు కావటంతో తీర్థ పొరపాటు పడింది. ఆమె చిన్నపిల్ల కదా’ అని అన్నారు. మరి, డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానున్న సలార్‌ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetmoney girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş