iDreamPost
android-app
ios-app

బ్రేకప్ అయ్యింది. సైకో లవర్‌ను వదిలించుకోవడం చాలా కష్టం: సింగర్ శ్రీరామ చంద్ర

టాలీవుడ్ టాప్ సింగర్లలో ఒకరు శ్రీరామ చంద్ర. తన గాత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దులను చేసేశాడు. ప్లేబ్యాక్ సింగర్ గా బిజీగా ఉన్న శ్రీరామ చంద్ర.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలు పంచుకున్నాడు.

టాలీవుడ్ టాప్ సింగర్లలో ఒకరు శ్రీరామ చంద్ర. తన గాత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దులను చేసేశాడు. ప్లేబ్యాక్ సింగర్ గా బిజీగా ఉన్న శ్రీరామ చంద్ర.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలు పంచుకున్నాడు.

బ్రేకప్ అయ్యింది. సైకో లవర్‌ను వదిలించుకోవడం చాలా కష్టం: సింగర్ శ్రీరామ చంద్ర

టాలీవుడ్ సూపర్ సింగర్ శ్రీరామ చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2007-08 నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో తన గళంతో ఓలలాడించిన శ్రీరామ్.. ఇండియన్ ఐడల్‌లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఆ తర్వాత అతడి పాపులారిటీ మరింతగా పెరిగిపోయింది. ఈ ప్లే బ్యాక్ సింగర్ బిగ్ బాస్ సీజన్ 5లో మెరిశాడు. సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. అతడు పాడిన పాటల్లో.. తీన్ మార్ మూవీలోని ‘గెలుపు తలుపులు తీసే ఆకాశమే..’, లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ ‘అటు ఇటు ఊగుతూ’, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ‘ఏం చేద్దాం, మేఘాల్లో’‘ మరీ ఇంతగా’, బద్రీనాథ్‌ ‘నచ్చావురా’ సాంగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఖాతాల్లో బిగ్గెస్ట్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. ప్రస్తుతం అటు తమిళ్, హిందీ డబ్బింగ్ వర్షన్లకు కూడా పాటలు పాడుతూ బిజీ అయిపోయాడు.

పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు. తాజాగా రీతూ చౌదరి యాంకర్‌గా వ్యవరిస్తోన్న దావత్ ప్రోగ్రామ్‌కు గెస్టుగా వచ్చిన శ్రీరామ్ .. పలు విషయాలు పంచుకున్నాడు. తనదైన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది రీతూ.. తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. యంగ్ యాక్టర్స్ కుషిత, సుప్రితకు మీరంటే క్రష్ అని శ్రీరామ చంద్రకు చెప్పింది రీతూ. ప్రస్తుతం తను సింగల్ అని చెప్పాడు. తన కెరీర్ గురించి మాట్లాడారు. ఈ క్రమంలో తన బ్రేకప్స్ గురించి మాట్లాడుతూ.. ‘గతంలో నేను రిలేషన్‌లో ఉండేవాడిని. కానీ ప్రస్తుతం బ్రేకప్ అయ్యింది. వర్కౌట్ కాకపోతే ఎక్కువ ఉండలేం. నాకు పాజిటివ్ ఎన్విర్వాన్ మెంట్ ఇష్టం. ఎక్కువ గొడవలు అవుతున్నాయి అనుకుంటే నేను మాయం అయిపోతా. నా స్పేస్‌లో నేను ఉంటారు. వర్కౌట్ కావట్లేదు. లైట్ తీసుకో అనుకుంటా’ అని చెప్పాడు.

జిడ్డులా పట్టుకున్న లవ్ గురించి మాట్లాడుతూ.. ‘రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఊర్మిళలా గారిలా సైకో టైప్ లవర్స్ కొంత మంది ఉంటారు. వారిని వదిలించుకోవడం కష్టం. వాళ్లు కొంచెం జెన్యూన్‌గా ఉంటారు. వర్కౌట్ అవ్వనప్పుడు రిలేషన్ షిప్ కష్టం. నో అనే ఆన్సర్ తీసుకోలేరు. రిలేషన్ షిప్ టాక్సిక్ అవుతా ఉంటుంది. వారిని ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు. నాకు సొల్యూషన్ దొరకట్లేదు. దూరంగా ఉండటం తప్పితే.. నాకేమీ చేత కావడం లేదు’ అని చెప్పుకొచ్చాడు. వీటితో పాటు తన గొంతు ఇష్టపడి ఓ లేడీ ఫ్యాన్ ఇంటికి వచ్చేసిందని, వెంటనే అమ్మ కంగారు పడుతూ ఫోన్ చేసిందని చెప్పుకొచ్చాడు ఈ స్టార్ సింగర్.

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomgrandpashabetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom