iDreamPost
android-app
ios-app

ప్రముఖ సింగర్ మృతి.. విషప్రయోగమే అంటున్న కుటుంబ సభ్యులు!

  • Published Sep 20, 2024 | 11:03 AM Updated Updated Sep 20, 2024 | 11:03 AM

Singer Ruksana Bano: ఈ మద్య కాలంలో సినీ పరిశ్రమలో విషాదాలు వెంటాడుతున్నాయి. తాము అభిమానించే సెలబ్రెటీలు కన్నుమూయడంతో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు.

Singer Ruksana Bano: ఈ మద్య కాలంలో సినీ పరిశ్రమలో విషాదాలు వెంటాడుతున్నాయి. తాము అభిమానించే సెలబ్రెటీలు కన్నుమూయడంతో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు.

  • Published Sep 20, 2024 | 11:03 AMUpdated Sep 20, 2024 | 11:03 AM
ప్రముఖ సింగర్ మృతి.. విషప్రయోగమే అంటున్న కుటుంబ సభ్యులు!

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు. గుండెపోటు, వయోభారం, అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. గత నెల రోజుల్లోనే నటి ఆశా వర్మ, తమిళ కమెడియన్ బిజిలి రమేష్, బాలీవుడ్ నటుడు వికాస్ సేథీ, ప్రముఖ నిర్మాత ఢిల్లీ గణేష్ మరణాలు మరువక ముందే ప్రముఖ సింగర్ కన్నుమూయడంతో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ సింగర్ రుక్సానా బానో(27) భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఒడిశా సంబల్‌పూర్ కి చెందిన ఆల్బామ్ సింగర్ గా రుక్సానా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రుక్సానా బానో ని కుటుంబం సభ్యులు ఆగస్టు 27 న ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ రుక్సానా కన్నుమూసింది.. ఈ విషయం తెలిసిన అభిమానులు షాక్ కి గురయ్యారు. చిన్న వయసులోనే స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న రుక్సానా మరణం ఆమె తల్లి, సోదరుడు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాదు ఆమె మరణం వెనుక కుట్ర దాగి ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

15 రోజుల క్రితం రుక్సానా బోలంగిర్ లో జ్యూస్ తాగి షూటింగ్ చేస్తున్నపుడు హఠాత్తుగా అస్వస్థతకు గురైంది. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న రుక్సానా తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే బోలంగీర్ లోని భీమా భోయ్ మెడికల్ కాలేజ్ కం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి క్షీణించడంతో బర్గర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరించారు. అక్కడ కూడా ఆమె పరిస్థితి మెరుగు పడకపోవడంతో భువనేశ్వర్ కు తీసుకువెళ్లి చికిత్స అందంచారు. చికిత్స పొందుతూ చనిపోయిందని ఆమె సోదరి రూబీ బానో మీడియాకు తెలిపారు. ఇదిలా ఉంటే ఆస్పత్రి వర్గాలు రుక్సానా విషపురుగు కాటుకు గురైందని అంటుంటే.. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఇందుకు భిన్నంగా రుక్సానా పై విష ప్రయోగం జరిగిందని.. ఆమె ప్రత్యర్థి సింగర్ ఇందుకు కారణం అని ఆరోపిస్తున్నారు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet