iDreamPost
android-app
ios-app

వీడియో: డ్రగ్స్ కేసులో ప్రముఖ సింగర్ అరెస్ట్!

  • Published May 27, 2024 | 12:38 PM Updated Updated May 27, 2024 | 12:38 PM

Singer Nicki Minaj Arrested: ఈ మధ్య కాలంలో కొంతమంది సెలబ్రెటీలు డ్రగ్స్ అమ్మడం, తీసుకోవడం ద్వారా పోలీసులకు దొరికిపోతున్నారు. ఈ మధ్యనే బెంగుళూరు లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ కలకలం చేలరేగింది.

Singer Nicki Minaj Arrested: ఈ మధ్య కాలంలో కొంతమంది సెలబ్రెటీలు డ్రగ్స్ అమ్మడం, తీసుకోవడం ద్వారా పోలీసులకు దొరికిపోతున్నారు. ఈ మధ్యనే బెంగుళూరు లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ కలకలం చేలరేగింది.

  • Published May 27, 2024 | 12:38 PMUpdated May 27, 2024 | 12:38 PM
వీడియో: డ్రగ్స్ కేసులో ప్రముఖ సింగర్ అరెస్ట్!

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా అక్రమాయుధాల సరఫరా, డ్రగ్స్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో గన్స్, డ్రగ్స్ కల్చర్ విలయతాండవం చేస్తున్నాయి. మైనర్లు సైతం గన్స్ తో రెచ్చిపోతున్నారు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇక్కడ యూత్ డ్రగ్స్ తో మత్తులో జోగిపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు డ్రగ్స్ వాడుతూ పోలీసులకు చిక్కుతున్నారు. పార్టీ కల్చర్ లో ఈ మధ్య డ్రగ్స్ వాడకం సర్వసాధారణం అయ్యింది. కొకైన్, గంజాయి తీసుకుంటూ మత్తులో ఊగిపోతున్నారు. డ్రగ్స్ కేసులో ప్రముఖ సింగర్ ని ఏయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేసిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

అమెరికాన్ స్టార్ ర్యాపర్, సింగర్ నిక్కీ మినాజ్ (41) ని అరెస్టు చేశారు పోలీసులు. అయితే.. అరెస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత ఆమెను రిలీజ్ చేశారు. అసలు ఏం జరిగిందంటే.. ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ లో నిక్కీ మినాజ్ కి ఓ ఈవెంట్ ఉంది. ఈ క్రమంలోనే ఆమె మాంచెస్టర్ కి వెళ్లేందుకు ఆమ్‌స్టర్‌డామ్ లోని షిపోల్ ఎయిర్ పోర్టు వద్దకు  చేరుకోగానే ఊహించని పరిణామం జరిగింది. తన బ్యాగ్ లో డ్రగ్స్ ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఆమ్‌స్టర్‌డామ్ ఆఫీసర్లు, సెక్యూరిటీతో అక్కడికి చేరుకొని ఆమెను నిర్భందించారు. నిక్కీ బ్యాగ్ లో కొన్ని ‘సాఫ్ట్ డ్రగ్స్’ ఉన్నాయని.. ఆ వస్తువులు నెదర్లాండ్ లో నిషేదం అని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Star Singer

ఈ సంఘటనను నిక్కి తన మొబైల్ ఫోన్ లో ప్రత్యక్షంగా చిత్రీకరించింది. ఆమె నుంచి డ్రగ్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత ‘ ఆ వస్తువులు నావి కావు.. నా సెక్యూరిటీ గార్డుకి చెందినవి’ అని నిక్కి మినాజ్ చెప్పినప్పటికీ పోలీసులు వినలేదు. ఆమెను తమ కారులో కూర్చొమని చెప్పారు.. దీంతో నిక్కీ మినాజ్ వారి పట్ల నిరసన వ్యక్తం చేసింది. మొత్తానికి ఆమెను పోలీసులు వదిలిపెట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. ఆమె పాల్గొనాలనుకున్న కార్యక్రమం వాయిదా పడింది. మరో కొత్త తేదీ ప్రకటిస్తామని అభిమానులకు నిక్కీ టీమ్ తెలిపింది. తన వద్ద డ్రగ్స్ లేవని చెబుతున్నా.. పోలీసులు అనవసరంగా నా ప్రోగ్రామ్ చెగొట్టారు.. అంటూ ఆదేదన వ్యక్తం చేసింది. 2010 లో ‘పిక్ ఫ్రైడే’ ఆల్బామ్ తో నిక్కీ మినాజ్ పాప్ సంగీతంలోకి అడుగుపెట్టింది. ఆమె కెరీర్ లో పలు అవార్డులు గెల్చుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Barbie (@nickiminaj)