iDreamPost
android-app
ios-app

కమల్ హాసన్‌తో రెండో సినిమా చేయనున్న ఆ హీరో?

  • Published Mar 17, 2024 | 2:03 PM Updated Updated Mar 17, 2024 | 3:01 PM

కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం థగ్ లైఫ్. త్రిష, జయం రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఇందులో దుల్కర్ సల్మాన్ కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అతడు తప్పుకున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు

కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం థగ్ లైఫ్. త్రిష, జయం రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఇందులో దుల్కర్ సల్మాన్ కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అతడు తప్పుకున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు

  • Published Mar 17, 2024 | 2:03 PMUpdated Mar 17, 2024 | 3:01 PM
కమల్ హాసన్‌తో రెండో సినిమా చేయనున్న ఆ హీరో?

ఉలగనాయగన్ కమల్ హాసన్ 234వ సినిమాగా తెరకెక్కుతున్న థగ్ లైఫ్ తమిళ సినిమా పరిశ్రమకే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న భారీ ప్రాజెక్ట్. ప్రధానంగా నాయకుడు వంటి క్లాసిక్ తరువాత ఇన్నేళ్లకి మళ్ళీ మణిరత్నం – కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, త్రిష మరియు జయం రవి కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో ఒక పాత్రలో నటించాల్సి ఉండింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దుల్కర్ స్థానంలో మరో హీరో వచ్చినట్లు తెలుస్తోంది.

నిజానికి కమల్ – దుల్కర్ లను ఒకేసారి తెర పై చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే డేట్ల సమస్యల కారణంగా ఈ యాక్షన్ డ్రామా నుండి తప్పుకున్నారు. తాజా బజ్ ప్రకారం, శింబుని ఈ పాత్రను పోషించడానికి ఎన్నుకున్నట్లు గట్టి టాక్ వినిపిస్తుంది. ఈ వార్తలు గనక నిజం అయితే కమల్ హాసన్ తో కలిసి పని చేయడం శింబుకు ఇది రెండో సారి అవుతుంది. డేసింగ్ పేరియాసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శింబు 48వ సినిమాకి కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాకి కూడా వీరిద్దరూ పని చేస్తే ఈ కాంబినేషన్లో రెండో సినిమా అవుతుంది.

Simbu acting with kamal haasan

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మణిరత్నంతో శింబు పనిచేయడం ఇదే తొలిసారి. నిజానికి ఈ లెజెండరీ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పోన్నియిన్ సెల్వన్ లో ప్రధాన పాత్రను శింబు నటిస్తారని అప్పట్లో పుకార్లు వచ్చినా అవి నిజం కాలేదు. మొదటి శింబు కెరీర్ లో వివాదాలు ఒక భాగం అయినప్పటికీ… స్టార్ గా ప్రేక్షకులలో ఇమేజ్ మాత్రం చెక్కుచెదరలేదు. కాగా కొన్నేళ్ల పాటు ఎక్కువగా ఫ్లాప్ లే చూసినా, వెంకట్ ప్రభు తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మానాడు (2021) తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి కమ్ బ్యాక్ ఇచ్చారు శింబు. థగ్ లైఫ్ ప్రాజెక్ట్‌ లో శింబు చేరడం ఖచ్చితంగా చిత్ర నిర్మాతలకి ప్లస్ అవుతుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş