iDreamPost
android-app
ios-app

లైవ్‌లో పాట పాడి అదరగొట్టిన సిల్క్‌ స్మిత.. వైరల్‌గా పాత వీడియో!

  • Published Oct 03, 2023 | 5:54 PM Updated Updated Oct 03, 2023 | 5:54 PM
  • Published Oct 03, 2023 | 5:54 PMUpdated Oct 03, 2023 | 5:54 PM
లైవ్‌లో పాట పాడి అదరగొట్టిన సిల్క్‌ స్మిత.. వైరల్‌గా పాత వీడియో!

ఒకప్పటి సినిమా శృంగార తార సిల్క్‌ స్మిత తెలియని సినీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. కొన్ని దశాబ్ధాల పాటు కుర్రకారు గుండెల్లో ఆమె రైళ్లు పరిగెత్తించారు. రాత్రిళ్లు కంటి మీద కునుకులేకుండా చేశారు. అయితే, వ్యక్తిగత సమస్యల కారణంగా ఆమె 1996లో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని ఆమె ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయారు. ఆమె చనిపోయి దాదాపు పాతికేళ్లు అవుతున్నా.. ప్రేక్షకుల గుండెల్లో మాత్రం చెరిగిపోకుండా అలానే ఉండిపోయారు.

ఆమె మీద బాలీవుడ్‌లో ఓ సినిమానే వచ్చింది. చాలా సినిమాల్లో ఆమె రిఫరెన్స్‌ కూడా ఉంది. మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ మార్క్‌ ఆంటోనీ’ సినిమాలో జూనియర్‌ సిల్క్‌ స్మితను పెట్టి ఓ పాత్రనే క్రియేట్‌ చేశారు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. జూనియర్‌ సిల్క్‌ స్మితకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక, అసలు విషయానికి వస్తే.. సిల్క్‌ స్మిత చనిపోవడానికి కొన్నేళ్ల ముందు వరకు వేరే దేశాల్లో జరిగే ఈవెంట్లకు వెళ్లేవారు. అక్కడ డ్యాన్సులు చేసే వారు. పాటలు పాడేవారు.

 మలేషియన్‌ వాసుదేవన్‌తో ప్రోగ్రాములు చేసేవారు. ఇందుకు సంబంధించిన ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆమె ఓ తమిళపాట పాడారు. వాసుదేవన్‌తో కలిసి స్టేజిపై అదరగొట్టారు. పాట పాడుతూ ఆ పాటకు తగ్గట్టుగా డ్యాన్స్‌ కూడా చేశారు. ఆ వీడియో చూస్తుంటే.. సిల్క్‌ స్మిత నిన్న మొన్న పాట, పాడి డ్యాన్స్‌ చేసినట్లుగా ఉంది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. సిల్క్‌ స్మిత మంచి తనాన్ని.. చిన్న పిల్లలాంటి ఆమె మనసును గుర్తు చేసుకుంటున్నారు. మరి, వైరల్‌గా మారిన సిల్క్‌ స్మిత వైరల్‌ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom