iDreamPost
android-app
ios-app

లేడీ డైరెక్టర్‌తో సిద్ధు కొత్త మూవీ.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

  • Published Aug 06, 2024 | 12:55 PM Updated Updated Aug 06, 2024 | 12:55 PM

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సక్సెస్ ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు అతడి నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. గతంలో ఓ మూవీని ఎనౌన్స్ చేశారు. ఈ మూవీతో నీరజ కోన దర్శకురాలిగా పరిచయం కాబోతుంది.

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సక్సెస్ ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు అతడి నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. గతంలో ఓ మూవీని ఎనౌన్స్ చేశారు. ఈ మూవీతో నీరజ కోన దర్శకురాలిగా పరిచయం కాబోతుంది.

  • Published Aug 06, 2024 | 12:55 PMUpdated Aug 06, 2024 | 12:55 PM
లేడీ డైరెక్టర్‌తో సిద్ధు కొత్త మూవీ.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

ప్రముఖ నిర్మాత కోనా వెంకట్ సోదరి, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా మారబోతుంది. యంగ్ అంట్ టాలెంట్ బాయ్ సిద్దు జొన్నలగడ్డతో తెలుసు కదా అనే మూవీని తెరకెక్కిస్తోంది. ఇందులో సిద్దు సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు ఆడిపాడనున్నారు. రాశీఖన్నాతో పాటు కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల తెరకెక్కిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తొలుత ఈ మూవీ లీడ్ రోల్ కోసం నితిన్‌ను సంప్రదించగా.. సిద్దు అయితే క్యారెక్టర్ కు న్యాయం చేస్తాడని భావించి.. ఈ ప్రాజెక్టు ఈ యంగ్ హీరో వద్దకు వెళ్లిందట. కథ నచ్చి ఒప్పుకున్నాడు ఈ యంగ్ హీరో.

ఈ ఏడాది స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ పుట్టిన రోజు పురస్కరించుకుని ఓ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో స్టార్ కాస్ట్ గురించి చెప్పారు.   కాగా, ఈ మూవీ ఎనౌన్స్ మెంట్ అయ్యింది కానీ పట్టాలెక్కినట్లు దాఖలాలు లేవు. తాజాగా ఈ మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. సిద్దు, శ్రీనిధి వీడియోలో కనిపించారు. షూటింగ్ స్టార్టైన వీడియోను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎక్స్ వేదికగా పంచుకుంది. కాగా, ఇది ఓ రొమాంటిక్ సినిమాగా తెరకెక్కబోతుంది. ప్యూర్ లవ్ స్టోరీలా కనిపించబోతుంది. ఇది ట్రయాంగిల్ స్టోరీనా అని కూడా తెలియాల్సి ఉంది. ఈ సినిమా దర్శకురాలే..కథను అందించారు. షూటింగ్ తాజాగా మొదలు కాగా, ఈ షెడ్యూల్ 30 రోజుల పాటు కొనసాగనుంది.

Siddhu Jonnalagadda, Telusu Kada, Neeraja Kona 2

వచ్చే ఏడాది తొలి సగంలో రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.  జోష్ మూవీతో కెరీర్ స్టార్ చేసిన సిద్దు… గుంటూరు కారం మూవీతో రికగ్నైజ్ అయ్యాడు. కృష్ణ అండ్ హిజ్ లీలా ఓకే అనిపించుకుంది. అతడి గ్రేస్ మొదలైంది డీజే టిల్లుతోనే. డీజే టిల్లుతో ఫేమ్ అయ్యాడు. ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయిన ప్రేమికుడిగా నటించాడు. ఈ ఏడాది టిల్లు స్క్వేర్‌తో అదరగొట్టేశాడు. తన మార్క్ నటనతో మరోసారి మెస్మరైజ్ చేశాడు సిద్దు జొన్నలగడ్డ. ఇప్పుడు అతడి చేతిలో మూడు ప్రాజెక్టులున్నాయి. తెలుసు కదాతో పాటు జాక్, టిల్లు క్యూబ్ కూడా ఉండబోతుంది.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabet