iDreamPost
android-app
ios-app

అదితి-సిద్ధార్థ్ పెళ్లి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

  • Published Jun 02, 2024 | 1:33 PM Updated Updated Jun 02, 2024 | 1:33 PM

బాయ్స్ చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన సిద్దార్థ్ తర్వాత నటుడు, నిర్మాత, గాయకుడిగా సత్తా చాటాడు. ఇటీవల సిద్దార్థ్ తాను ప్రేమించి హీరోయిన్ అదితిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బాయ్స్ చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన సిద్దార్థ్ తర్వాత నటుడు, నిర్మాత, గాయకుడిగా సత్తా చాటాడు. ఇటీవల సిద్దార్థ్ తాను ప్రేమించి హీరోయిన్ అదితిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  • Published Jun 02, 2024 | 1:33 PMUpdated Jun 02, 2024 | 1:33 PM
అదితి-సిద్ధార్థ్ పెళ్లి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు.. ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. చాలా వరకు సినీ సెలబ్రెటీలు తమ సహనటులతో కొంతకాలం రిలేషన్ షిప్ కొనసాగించి పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలెక్కుతున్నారు. గత ఏడాది నుంచి వరుసగా సినీ ఇండస్ట్రీల పెళ్లి బాజాలు మోగుతున్నాయి. 2003 లో రిలీజ్ అయిన ‘బాయ్స్’ సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన సిద్దార్థ తర్వాత హీరోగా పలు చిత్రాల్లో తన సత్తా చాటాడు.హీరోగానే కాకుండా నిర్మాత, సింగర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు సిద్దార్థ్. గత కొంత కాలంగా సిద్దార్థ- అదితి రావు హైదరీ రిలేషన్ షిప్ లో ఉంటున్న విషయం తెలిసిందే.. తాజాగా వీరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..

బాయ్స్ చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన సిద్దార్థ్ తర్వాత హీరోగా వరుస హిట్స్ తో అమ్మాయి కలల రారాజుగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో సిద్దార్థ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. గత కొంత కాలంగా బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరీతో సిద్దార్థ రిలేషన్ షిప్ లో ఉంటున్న విషయం తెలిసిందే. చాలా సందర్భాల్లో ఈ జంట సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉంటున్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు ఈ జంట. ప్రస్తుతం సిద్దార్థ్.. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్ 2’ మూవీలో నటిస్తున్నాడు. మొదటిసారిగా ఈ సినిమాలో సిద్దార్థ నెగిటీవ్ రోల్ లో నటిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్.

మరోవైపు అదితి రావు ‘హీరామండి’ సీరీస్ తో బిజీ బిజీగా ఉంది. ఈ కారణంగానే ఇటీవల పెళ్లి పీటలెక్కాల్సి ఉండగా వాయిదా పడినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ జంట పెళ్లిపై మరోసారి సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి.  ఈ ఏడాది డిసెంబర్ లో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. త్వరలో పెళ్లి ముహూర్తానికి సంబంధించిన అఫిషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ వివాహం ఇద్దరికీ రెండోది. సిద్దార్థ్ 2003లో తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల 2007 లో విడాకులు ఇచ్చాడు. మరోవైపు అదితి 2009 లో సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. 2013లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ‘మహా సముద్రం’ మూవీలో అదితి- సిద్దార్థ్ జంటగా నటించారు. అప్పటి నుంచి వీరి మధ్యప్రేమ చిగురించి పెళ్లి వరకు వచ్చింది. ఇటీవల సిద్దార్థ్ ‘చిన్నా’ అనే మూవీతో మంచి విజయం అందుకున్నాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom