iDreamPost
android-app
ios-app

Siddharth: కొత్త సినిమా ఫ్లాప్ – పాత సినిమా హిట్

  • Published Feb 16, 2024 | 4:40 PM Updated Updated Feb 16, 2024 | 4:40 PM

ఓయ్ రీ రిలీజ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. వాలెంటైన్స్ డే రోజున ఓయ్ ఆడిన ప్రతి థియేటర్ హౌజ్ ఫుల్ అయింది. అయితే చిత్రం ఏమిటంటే సిద్ధార్థ్ పాత ఫ్లాప్ సినిమా రీ రిలీజ్ లో హిట్ అవగా... కొత్త సినిమా మాత్రం ఫ్లాప్ అయింది.

ఓయ్ రీ రిలీజ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. వాలెంటైన్స్ డే రోజున ఓయ్ ఆడిన ప్రతి థియేటర్ హౌజ్ ఫుల్ అయింది. అయితే చిత్రం ఏమిటంటే సిద్ధార్థ్ పాత ఫ్లాప్ సినిమా రీ రిలీజ్ లో హిట్ అవగా... కొత్త సినిమా మాత్రం ఫ్లాప్ అయింది.

  • Published Feb 16, 2024 | 4:40 PMUpdated Feb 16, 2024 | 4:40 PM
Siddharth: కొత్త సినిమా ఫ్లాప్ – పాత సినిమా హిట్

హీరో సిద్ధార్థ్ పదిహేనేళ్ళ క్రితం నటించిన ఓయ్ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా థియేటర్లలో రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి అప్పట్లోనే మంచి క్రేజ్ తో విడుదలయిన ఓయ్… అంచనాలను అందుకోలేక పోయి ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఈ సినిమా రీ రిలీజ్ కు మాత్రం అద్భుతమైన స్పందన వచ్చింది. వాలెంటైన్స్ డే రోజున ఓయ్ ఆడిన ప్రతి థియేటర్ హౌజ్ ఫుల్ అయింది. అయితే చిత్రం ఏమిటంటే సిద్ధార్థ్ పాత ఫ్లాప్ సినిమా రీ రిలీజ్ లో హిట్ అవగా… కొత్త సినిమా మాత్రం ఫ్లాప్ అయింది.

గత అక్టోబర్ లో సిద్ధార్థ్ నటించిన చిన్నా (తమిళ్ లో చిత్తా) రిలీజ్ అయింది. మొదట తమిళంలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న తరువాత తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. అయితే చిన్నా సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కేవలం 15 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగింది. మంచి సందేశాత్మక చిత్రం అనే పేరు వచ్చినా ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద సరైన ఆదరణ లభించలేదు. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలని ప్రచార కార్యక్రమాల్లో సిద్ధార్థ్ ఎమోషనల్ స్పీచ్ కూడా ఇచ్చారు. కానీ చివరికి తెలుగు రాష్ట్రాల్లో చిన్నా సినిమా ఫెయిల్యూర్ గానే నిలిచింది.

అయితే, మరో వైపు, వాలెంటైన్స్ డే సందర్భంగా మళ్లీ విడుదలైన సిద్ధార్థ్ యొక్క ఓయ్, బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందింది. ఓయ్ సినిమా రీ-రిలీజ్ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 1 కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అంతే కాకుండా 2024లో అత్యధిక వసూళ్లు రాబట్టిన రీ-రిలీజ్ సినిమాగా నిలిచి రికార్డు క్రియేట్ చేసింది. ఓయ్ సినిమాలోని పాటలకు ఉన్న క్రేజ్, సిద్ధార్థ్ లుక్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కోసం ప్రేక్షకులు మళ్ళీ ఒకసారి ఆ సినిమాని చూసి ఆనందించారు. అయితే ముందుగా చెప్పుకున్నట్టు ఒక హీరో కొత్త సినిమా మొదటి రోజున 15 లక్షలు వసూలు చేయడం, అదే హీరో పాత సినిమా రీ-రిలీజ్ అయి ఒక్క రోజులో 1 కోటికి పైగా వసూలు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.