iDreamPost
android-app
ios-app

గోతులు తీసేవారు.. అందులోనే పడతారు! శ్రుతిహాసన్‌ను ఎవరేమన్నారు?

  • Published Aug 18, 2023 | 4:05 PM Updated Updated Aug 18, 2023 | 4:05 PM
  • Published Aug 18, 2023 | 4:05 PMUpdated Aug 18, 2023 | 4:05 PM
గోతులు తీసేవారు.. అందులోనే పడతారు! శ్రుతిహాసన్‌ను ఎవరేమన్నారు?

తెలుగు సినిమాలతో స్టార్‌ డమ్‌ తెచ్చుకుని.. అంతలోనే కెరీర్‌పై పూర్తిగా దృష్టిపెట్టకుండా.. అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో మెరుస్తున్న హీరోయిన్‌ శ్రుతిహాసన్‌. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సూపర్‌ హిట్‌ మూవీ గబ్బర్‌సింగ్‌తో తన కెరీర్‌లో తొలి హిట్‌ అందుకున్న శ్రుతీ.. ఆ తర్వాత ఓ స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగులో చాలా సినిమాలే చేసింది. ఈ ఏడాది ఆరంభంలో ఇద్దరు పెద్ద హీరోలు చిరంజీవి, బాలయ్య సినిమాలతో సూపర్‌ హిట్‌లు కొట్టింది. ఇక వచ్చే నెలలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ మూవీ సలార్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో శ్రుతిహాసన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్టును పెట్టింది.

ఆ పోస్టులో.. ‘కొంతమంది గోతులు తీసేవారిని నేను గమనిస్తున్నాను. వానీ వాళ్లే అందులో పడిపోతారు. అందుకే నేను అలాంటి వారిని చూసి చూడనట్టు సైలెంట్‌గా నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోతుంటున్నా.. కర్మ వాళ్లకు తగినట్లు శిక్షిస్తుంది’ అని ఉంది. అయితే.. ఈ పోస్టు కచ్చితంగా ఎవరినో ఉద్దేశించి పెట్టిందనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ఎందుకంటే ఇద వేదాంతం శ్రుతిహాసన్‌ మాట్లాడిదంటే.. కచ్చితంగా తనను ఎవరో ఏదో అన్నారనే విషయం తెలిసిపోతుంది. లేకుంటే.. ఇలాంటి పోస్టు తనేందుకు పెడుతుంది. అయితే.. అసలు శ్రుతీని ఎవరు ఎమన్నారన్నదే ఇక్కడ అసలు ప్రశ్న.

అయితే.. శ్రుతి తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న ఏదైన విజయం గురించి చెబుతూ.. ఇలా పోస్టు చేసిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో హీరో సిద్ధార్థ్‌, అలాగే ఓ ఫారెన్‌ కుర్రాడితో ప్రేమ వ్యవహారాలు నడిపిన శ్రుతిహాసన్‌.. ప్రస్తుతం శంతను హజరికా అనే కుర్రాడితో రిలేషన్‌లో ఉంది. అయితే అతడిని ఫ్రెండ్‌ అని చెబుతుంది. కాగా.. ప్రస్తుతం ఇన్‌స్టాలో పెట్టిన పోస్టు వాళ్ల రిలేషన్‌షిప్‌ గురించి ఎవరో చేసిన కామెంట్‌కు కౌంటర్‌గా పెట్టిందా అని కూడా సినీ వర్గాలు చర్చించికుంటున్నాయి. ఏది ఏమైనా.. శ్రుతిహాసన్‌ ఈ పోస్టు పెట్టడం వెనుక ఎవరికో గట్టి కౌంటర్‌ ఇచ్చిందనేది మాత్రం ఒప్పుకోవాల్సిన నిజం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బిగ్ బాస్ 7.. కొత్త ప్రోమోలో మెరిసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş