iDreamPost
android-app
ios-app

Shruti Haasan: టాక్సిక్‌ సినిమాలో మరో హీరోయిన్‌గా శృతిహాసన్‌!

  • Published Dec 16, 2023 | 3:57 PM Updated Updated Dec 16, 2023 | 3:57 PM

దాదాపు సంవత్సరం గ్యాప్‌ తర్వాత యశ్‌ తన కొత్త సినిమా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన టాక్సిక్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది...

దాదాపు సంవత్సరం గ్యాప్‌ తర్వాత యశ్‌ తన కొత్త సినిమా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన టాక్సిక్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది...

  • Published Dec 16, 2023 | 3:57 PMUpdated Dec 16, 2023 | 3:57 PM
Shruti Haasan: టాక్సిక్‌ సినిమాలో మరో హీరోయిన్‌గా శృతిహాసన్‌!

కేజీఎఫ్ సినిమాతో.. ప్యాన్‌ ఇండియా లెవల్‌లో సంచలనం సృష్టించాడు కన్నడ స్టార్ హీరో యశ్‌. ఆ తర్వత ‘కేజీఎఫ్ 2’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుని రికార్డులు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే యశ్ నెక్స్ట్ మూవీ పై అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడిలో ఆసక్తి నెలకొంది. కానీ, యశ్‌ మాత్రం కేజీఎఫ్‌ తర్వాత ఏడాది పాటు గ్యాప్ తీసుకున్నాడు. తమ హీరో సినిమా గురించి అప్‌డేట్‌ లేక అభిమానుల్లో అందోళన మొదలైంది.

ఈ క్రమంలోనే యశ్‌ తన కొత్త మూవీ గురించి వివరాలు అనౌన్స్ చేశాడు. ఆయన ‘టాక్సిక్‌’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘టాక్సిస్’ చిత్రానికి మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో యశ్‌కు జంటగా సాయి పల్లవి నటించబోతున్నారు. ఇక, ఇదే సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్‌ వచ్చింది. టాక్సిక్‌ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ నటించబోతోందని వార్త గట్టిగా వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు, ఇప్పుడు టాలీవుడ్లో వరుస ఆవకాశాలతో దుసుకెళ్తున్న శ్రుతి హాసన్.

shruti hasan in toxic

ఈ అందాల ముద్దుగుమ్మ ప్రస్తుతం అందరికీ లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. టాక్సిక్‌ చిత్ర యూనిట్ మరో హీరోయిన్ రోల్ కోసం శృతిని సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రాలేదు. అలానే శ్రుతి హాసన్ కూడా ఈ మధ్య చేసిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ అవుతోంది. దీంతో.. టాక్సిక్‌ మూవీలోకి శ్రుతి హాసన్‌ని కూడా తీసుకోవాలంటూ యశ్‌ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అలానే ఈ చిత్రంలో మలయాళ హీరోలు నివీన్ పొలి, టొవినో థామస్ నెగిటివ్ రోల్స్‌లో కనిపించబోతున్నారనే టాక్ కూడా ఉంది.

కాగా, శృతి హాసన్‌ నటించిన సలార్‌ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్‌ 22న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. శృతి హాసన్‌ సలార్‌లో ప్రభాస్‌కు జంటగా నటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. కేజీఎఫ్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్‌ నీల్‌ సలార్‌కు దర్శకత్వం వహించారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతి బాబు, ఈశ్వరి రావు, బాబీ సింహలు ప్రధాన పాత్రల్లో నటించారు. రవి బస్రూర్‌ సంగీతం అందించారు. మరి, యశ్‌ సినిమాలో శృతి హాసన్‌ హీరోయిన్ అనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet