iDreamPost
android-app
ios-app

ఆ రూల్స్ నాకు వర్తించవు.. వాటికి లోబడి ఉండలేను: శృతిహాసన్

  • Author ajaykrishna Published - 10:05 AM, Sat - 22 July 23
  • Author ajaykrishna Published - 10:05 AM, Sat - 22 July 23
ఆ రూల్స్ నాకు వర్తించవు.. వాటికి లోబడి ఉండలేను: శృతిహాసన్

కొంతమందికి సొసైటీకి అనుకూలంగా, కట్టుబాట్లకు లోబడి జీవించడం అంటే చాలా కష్టమైన వ్యవహారంలా భావిస్తుంటారు. తాను అలాంటి కోవకే చెందుతాను అంటోంది గ్లామర్ బ్యూటీ శృతిహాసన్. బేసిగ్గా సొసైటీకి కట్టుబడి కాకుండా తమ లైఫ్ తాము బ్రతికేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే.. ఎటు తిరిగి ఉండాల్సింది సొసైటీలోనే కాబట్టి.. అన్ని కాకపోయినా కొన్ని నిబంధనలైనా ఫాలో అవుతుంటారు. అయితే.. ఎన్ని నిబంధనలు ఉన్నా.. తాను పాటించే రకం కాదని ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తోంది శృతి. బయట సంఘం ఎలా ఉన్నా.. రూల్స్ నాకు వర్తించవు అనుకుంటూ తాను వెళ్ళాలి అనుకున్న దారిలో వెళ్తాను అంటోంది.

సొసైటీ గురించి.. అందులో రూల్స్ గురించి ఇదివరకు శృతి చాలాసార్లు తన పెదవి విప్పింది. అయితే.. నిజానికి సొసైటీకి కట్టుబడి లేకపోతే.. ఒక్కోసారి రూల్స్ ఫాలో అవ్వని వారి దారికి సొసైటీ అడ్డుగా వస్తుంటుంది. అలాగని విమర్శలు రాకుండా ఉండవు. వాటిని సైతం లెక్క చేయకుండా దూసుకుపోయే వాళ్ళుంటారు. తాను అదే తరహా అంటోంది ఈ విశ్వనటుడి కూతురు. నిబంధనలకు లోబడి ఉండటం చాలా కష్టమైన పని అని చెప్పుకొస్తుంది. అలాగే ఈ విషయంలో తనను వింత మనిషి అనుకున్నా పర్వాలేదని అంటోంది. అంతేగాక తనకు ఏది తప్పు.. ఏది ఒప్పు అనేవి విశ్లేషించే శక్తి ఉందని చెబుతోంది.

ఇదిలా ఉండగా.. శృతి ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు, వీడియోలు పెడుతూ రచ్చ చేస్తుంటుంది. అలాగే మ్యూజిక్ బ్యాండ్, బాయ్ ఫ్రెండ్ తో షికార్లు కూడా పోస్ట్ చేస్తుంది శృతి. నటిగానే కాకుండా శృతికి గాయనిగా కూడా మంచి పేరుంది. మిలియన్స్ లో సోషల్ మీడియా ఫాలోయర్స్ ని కలిగిన శృతి.. తెలుగుతో పాటు తమిళ, హిందీ లాంగ్వేజ్ లో మంచి ఫేమ్ సంపాదించుకుంది. హీరోయిన్ గా తెలుగులో స్టార్స్ అందరి సరసన సినిమాలు చేసిన శృతి.. ప్రెజెంట్ డార్లింగ్ ప్రభాస్ సరసన సలార్ మూవీ చేసింది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఆ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. మరి శృతి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet