iDreamPost
android-app
ios-app

బేబీ స్టోరీ వినకపోవడంపై.. విశ్వక్ కు బాహుబలి నిర్మాత పరోక్షంగా చురకలు!

  • Published Jul 31, 2023 | 6:39 PM Updated Updated Jul 31, 2023 | 6:39 PM
  • Published Jul 31, 2023 | 6:39 PMUpdated Jul 31, 2023 | 6:39 PM
బేబీ స్టోరీ వినకపోవడంపై.. విశ్వక్ కు బాహుబలి నిర్మాత పరోక్షంగా చురకలు!

ప్రస్తుతం టాలీవుడ్ లోఉన్న యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఎనర్జీ, టాలెంట్ నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. ఒక్క హీరోగానే కాకుండా స్క్రీన్ రైటర్ గా , డైరెక్టర్ గా తన స్టామినాను నిరూపించుకున్నాడు. ఎక్కడా కూడా ఎవరి కోసం తగ్గడం, తగ్గి మాట్లాడటం చేయడు. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడే ‘నన్ను ఎవ్వడూ లేపలేదు.. నన్ను నేనే లేపుకున్నాను’ అంటూ కామెంట్స్ చేయడం చూశాం. ఆ తర్వాత కూడా తన యాటిట్యూడ్ ఏమాత్రం మార్చుకోకుండా అంతే దూకుడుగా ముందుకు వెళ్తున్నాడు. ప్రేక్షకులు కూడా విశ్వక్ సేన్ ను అదే యాటిట్యూడ్ చూసే ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం అతని తీరు కొత్త తిప్పలు తెచ్చిపెట్టినట్లు కనిపిస్తోంది.

అసలు విషయం ఏంటంటే.. బేబీ అల్లు అర్జున్ కోసం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సాయి రాజేశ్ కథ చెప్తాను అంటే ఒక యంగ్ హీరో అసలు వినడానికి కూడా ఆసక్తి చూపలేదు అంటూ వ్యాఖ్యానించాడు. అయితే తర్వాత ఆ యంగ్ హీరో ఎవరు అంటూ చాలానే పేర్లు వినిపించాయి. కొన్ని గంటల తర్వాత ఆ హీరో ఎవరో కాదు.. విశ్వక్ సేన్ అంటూ ప్రచారం జరిగింది. సాయి రాజేశ్ బేబీ సినిమా కథ చెబుతాను అంటూ విశ్వక్ సేన్ కు ఫోన్ చేస్తూ అతను వినేందుకు ఆసక్తి చూపలేదని చెప్పుకొచ్చారు. ఆ విషయం కాస్తా వైరల్ కావడంతో విశ్వక్ కూడా స్వయంగా స్పందించాడు. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

పేకమేడలు సినిమా ట్రైలర్ లాంఛ్ కు విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఆ సమయంలో సినిమా గురించి మాట్లాడుతూ.. సమయం వచ్చిందని తనపై వచ్చిన ప్రచారలపై కూడా స్పందించాడు. “ఇటీవల ఒక సినిమా సూపర్ సక్సెస్ అయింది. చిన్న సినిమాగా వచ్చి అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. ఆ సినిమా డైరెక్టర్ నాకు ఫోన్ చేస్తే కథ వినేందుకు కూడా ఇష్టపడలేదని కామెంట్ చేస్తున్నారు. నిజానికి అతడిని పిలిచి ఒక గంటసేపు కథ విని ఆ తర్వాత నాకు నచ్చలేదు, నేను చేయను అని చెప్పే టైప్ కాదు. ఎందుకు అలా చెప్పడం మనంచేయం అనుకున్నప్పుడు ముందే చెప్పేస్తే అయిపోతుంది కదా అని అదే చెప్పాను. వాళ్ల సినిమా ట్రైలర్ చూసి డైరెక్టర్స్ గ్రూప్ లో బాగుందని ఫస్ట్ రియాక్ట్ అయింది నేనే. ఇండస్ట్రీలో ఏ సినిమా హిట్ అయినా నేను ఆనందిస్తాను.

అయినా మీ సినిమా హిట్ అయిందని సంతోషించాలి. దానిని ఎంజాయ్ చేయాలి. ఇలాంటి సమయంలో ఒకరిని కించపరచాలని చూడటం కరెక్ట్ కాదు” అంటూ విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు.  ఆ తర్వాత ఈ విషయం మొత్తం ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. తాజాగా బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఇదే అంశంపై స్పందించారు. యితే నేరుగా విశ్వక్ సేన్, బేబీ సినిమా పేరును వాడకపోయినా.. అనింది మాత్రం విశ్వక్ గురించే అర్థమైపోతోంది. “విజయం అనేది ఒక్కోసారి తలకు ఎక్కుతుంది. దానిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇటీవల ఓ యంగ్ హీరోకి తన యాటిట్యూడ్ వల్ల ఒక మంచి హిట్ వచ్చింది.

Shobu yarlagadda comments on vishwak sen

అయితే అతనికి కథ చెబుతాను అంటూ ఒక డెబ్యూ డైరెక్టర్ అడిగితే.. కనీసం మర్యాదలేకుండా అతను వ్యవహరించాడు. తన కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి ఈ యాటిట్యూడ్ పనికిరాదని త్వరలోనే తెలుసుకుంటాడని భావిస్తున్నాను” అంటూ శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. కానీ, వెంటనే డిలీట్ కూడా చేశారు. అయితే సమసిపోయింది అనుకున్న వివాదం.. ప్రముఖ నిర్మాత స్పందించడంతో మరోసారి తెరపైకి వచ్చింది. ఈ విషయంపై విశ్వక్ సేన్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. సోమవారం అతని కొత్త ప్రొజెక్ట్ ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ చాలా కొత్త స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు అనిపిస్తోంది. ఒక రగ్గుడ్ లుక్స్ తో విశ్వక్ చాలా కొత్తగా కనిపించాడు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో 1990ల కంటే ముందు జరిగిన ఒక కథను చూపించబోతున్నట్లు అనిపిస్తోంది. ఫస్ట్ గ్లింప్స్ కు చాలా మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigboss