iDreamPost
android-app
ios-app

మా విషయంలో అమ్మానాన్నకు నమ్మకం ఉంది: శివాని

  • Published Nov 16, 2023 | 10:10 AM Updated Updated Nov 16, 2023 | 10:10 AM

శివాని నటించిన తాజా చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నవంబర్‌ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శివాని ప్రమోషన్లలో బిజీ అయిపోయారు.

శివాని నటించిన తాజా చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నవంబర్‌ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శివాని ప్రమోషన్లలో బిజీ అయిపోయారు.

  • Published Nov 16, 2023 | 10:10 AMUpdated Nov 16, 2023 | 10:10 AM
మా విషయంలో అమ్మానాన్నకు నమ్మకం ఉంది: శివాని

శివానీ రాజశేఖర్‌.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. స్టార్‌ కపుల్‌ జీవిత-రాజశేఖర్‌ల కుమార్తెగానే కాదు హీరోయిన్‌గా కూడా  ఈమె అందరికీ తెలుసు. స్టార్‌ కిడ్‌గా ఇండస్ట్రీలోకి వచ్చినా.. తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారామె. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తున్నారు. మాతృభాష తెలుగులోనే కాదు.. తమిళంలోనూ సినిమాలు చేస్తున్నారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘ కోట బొమ్మాళి పీఎస్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీ అయిపోయింది. తాజాగా, ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివానీ రాజశేఖర్‌ గ్లామర్‌ పాత్రలు చేసే విషయంపై స్పందించారు. తనకు కూడా గ్లామర్‌ పాత్రలు చేయాలని ఉందన్నారు.  శివాని రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి గ్లామర్‌ రోల్స్‌ గురించి ఆలోచించటం లేదని అన్నారు. హర్డ్‌ వర్క్‌ చేయటం మాత్రమే మన చేతిలో ఉందని, దాన్నే నమ్ముతానని పేర్కొన్నారు. నచ్చింది చేసుకుంటూ పోవడమే తన పని అన్నారు. తనకు కూడా గ్లామరస్‌ రోల్స్‌ చేయాలని ఉందని వెల్లడించారు. అలాంటి పాత్రల కోసం ఎదురు చూస్తున్నానన్నారు. తమ కథల విషయంలో తల్లిదండ్రులు జీవిత రాజశేఖర్‌లు జోక్యం చేసుకోరని తెలిపారు. తమపై వారికి నమ్మకం ఉందని అన్నారు.

 ఇక, కోట బొమ్మాళి పీఎస్‌ సినిమా విషయానికి వస్తే.. ఇందులో రాహుల్‌ విజయ్‌, శివానీ జంటగా నటిస్తున్నారు. శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు చేశారు. అర్జున ఫల్గుణ ఫేమ్‌ తేజ్ మార్ని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్‌, రాహుల్‌ విజయ్‌, శివానీలు పోలీసు పాత్రల్లో కనిపించనున్నారు. కోట బొమ్మాళి కోసం శివాని శ్రీకాకుళం స్లాంగ్‌ నేర్చుకున్నారు. అంతేకాదు! పోలీస్‌ పాత్ర కోసం తండ్రి రాజశేఖర్‌ కొన్ని సలహాలు కూడా ఇచ్చారట. శివాని తాత గారు కూడా పోలీస్‌ అట. తండ్రి చాలా పోలీస్‌ పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. వారినుంచి తాను ఎంతో నేర్చుకున్నానని ఆమె తెలిపారు.

కాగా, శివాని 2021లో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించారు. అదే సంవత్సరం వచ్చిన ‘ అద్భుతం’ అనే సినిమాతో హీరోయిన్‌గా మారారు. ఈ మూవీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్‌ అయి సంచలన విజయాన్ని అందుకుంది. 2022లో ఆమె తమిళ ఎంట్రీ ఇచ్చారు. ‘‘ అన్బరివు’’ అనే సినిమాతో తమిళనాట కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరి, గ్లామర్‌ పాత్రలపై శివాని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom