iDreamPost
android-app
ios-app

ఎంతో ఇష్టమైన ఇల్లు.. అమ్మకతప్పట్లేదు: యాంకర్ శివజ్యోతి ఎమోషనల్!

  • Author ajaykrishna Published - 01:55 PM, Wed - 2 August 23
  • Author ajaykrishna Published - 01:55 PM, Wed - 2 August 23
ఎంతో ఇష్టమైన ఇల్లు.. అమ్మకతప్పట్లేదు: యాంకర్ శివజ్యోతి ఎమోషనల్!

బిగ్ బాస్ షో ద్వారా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న న్యూస్ రీడర్ కం యాంకర్ శివజ్యోతి గురించి అందరికీ తెలిసిందే. ఆమెను ఎక్కువగా సావిత్రి అని పిలుస్తుంటారు. అసలు పేరు శివజ్యోతి కంటే సావిత్రిగానే ఎక్కువ పాపులర్ అయ్యింది. తెలంగాణ యాసలో గలగలా వార్తలు చదువుతూ.. ఎంతో సరదాగా ప్రోగ్రాంని నడిపే సావిత్రి.. బిగ్ బాస్ లో అడుగుపెట్టాక తన క్రేజ్ ని డబుల్ చేసుకుంది. టీవీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత నుండి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటోంది. రెగ్యులర్ గా పోస్టులు, వీడియోలు పోస్ట్ చేస్తోంది. అంతేగాక సొంతంగా రెండు యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తూ.. ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. అయితే.. తాజాగా హోమ్ టూర్ వీడియో చేసిన జ్యోతి.. తన ఇంటి గురించి చెబుతూ ఎమోషనల్ అయింది.

తన ఇళ్లంతా చూపిస్తూ ఇలా చెప్పుకొచ్చింది. జ్యోతి మాట్లాడుతూ.. “మణికొండలో మేం కొన్న మొదటి ఇల్లు ఇది. 2019లో కొని.. 2020లో గృహప్రవేశం చేశాం. కానీ.. మేం ఇంట్లోకి వచ్చిన నెల రోజులకే లాక్ డౌన్ పడింది. ఈ ఇల్లు ఎంతో నచ్చి.. స్పెషల్ గా ఇంటీరియర్ డిజైన్స్ తయారు చేయించుకున్నాం. లాక్ డౌన్ కారణంగా రూ. 2 లక్షలు అప్పు చేసి మరీ ఇంట్లోకి వచ్చాము. నెలనెలా ఈఎంఐ ఎలా పే చేయాలని టెన్షన్ పడేదాన్ని. ఎందుకంటే ఎంతో ఇష్టంగా కొన్న ఇల్లు.. దీనితో ఎన్నో ఎమోషన్స్ ముడిపడి ఉన్నాయి. ఈ ఇల్లుని అదృష్టంగా భావించాను. ఎప్పటికి ఈ ఇంట్లో నుండి వెళ్ళకూడదని అనుకున్నాను. కానీ.. వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని అసలు అనుకోలేదు” అంటూ ఎమోషనల్ అయ్యింది.

అసలు ఏమైంది? శివజ్యోతి ఎందుకు కంటతడి పెట్టుకుంది? అనే వివరాల్లోకి వెళ్తే.. “ఇల్లు నాకు అన్ని ఇచ్చింది. ఆ ధైర్యంతోనే న్యూస్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. కానీ.. అది వర్కౌట్ కాలేదు. వ్యూస్ రాలేదని చాలా ఫీల్ అయ్యాను. ఓ రకంగా డిప్రెషన్ కి గురయ్యాను. కానీ.. ఇప్పుడీ ఇల్లు నాది కాదు. అమ్మేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే.. వేరే కొత్త ఇల్లు కొన్నాను. రెండు ఇళ్లకు ఈఎంఐ కట్టడం కష్టం అవుతుంది. సో.. అమ్మేద్దామని ఆలోచన చేస్తున్నా. ఎంతో ఇష్టమైన ఇల్లు అమ్మక తప్పట్లేదు. నన్ను ఊరికే తిట్టొద్దు.. అది చాలా ఎఫెక్ట్ అవుద్ది” అని చెప్పుకొచ్చింది శివజ్యోతి. అలా ఇల్లు గురించి చెబుతూనే ఎమోషనల్ అయిపోయి కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం జ్యోతి హోమ్ టూర్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి శివజ్యోతి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommarsbahisMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/