iDreamPost
android-app
ios-app

నటి కన్నీటి గాథ.. కరోనా టైమ్​లో నర్సుగా సేవలు.. బ్రెయిన్ ​స్ట్రోక్​తో పక్షవాతం..!

  • Author singhj Published - 09:39 PM, Wed - 26 July 23
  • Author singhj Published - 09:39 PM, Wed - 26 July 23
నటి కన్నీటి గాథ.. కరోనా టైమ్​లో నర్సుగా సేవలు.. బ్రెయిన్ ​స్ట్రోక్​తో పక్షవాతం..!

ఆమె ఓ అందాల తార. నటిగా మంచి పేరు తెచ్చుకొని అవకాశాలతో దూసుకెళ్తున్నారు. సరిగ్గా అదే సమయంలో కరోనా మహమ్మారి వచ్చింది. ఆ టైమ్​లో తన పేరు మరింత మార్మోగిపోయింది. నటిగా మూవీస్​లో మెప్పించడమే కాదు.. కొవిడ్ సమయంలో నర్సుగా మారి సేవలు అందించిన ఆ భామ పేరు శిఖా మల్హోత్రా. అటు వైద్యులతో పాటు ఇటు పేషెంట్లకు కూడా ఆమె తనవంతు సాయం అందించారు. తన హెల్త్​ను కూడా లెక్క చేయకుండా నర్సుగా మారి సేవలు అందించారు. ఈ రకంగానైనా జన్మనిచ్చిన దేశానికి సేవ చేసే భాగ్యం దొరికిందని పరవశించిపోయారు శిఖా మల్హోత్రా.

రోగులకు సేవలు అందించిన శిఖ కరోనా బారిన పడి పక్షవాతానికి గురయ్యారు. కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ‘ఫ్యాన్’ చిత్రంలో కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శిఖ. ఆ తర్వాత ‘రన్నింగ్ షాదీ’, ‘అన్​సీన్ ఈవిల్ 2’ మూవీస్​తో తన క్రేజ్​ను మరింత పెంచుకున్నారు. 2020లో కరోనా విజృంభించిన సమయంలో ముంబైలోని బాలాసాహెబ్ ఠాక్రే ట్రామా సెంటర్​ ఆస్పత్రిలో నర్సుగా సేవలు అందించి అందరి మనసులను ఆమె గెలుచుకున్నారు. అయితే మంచివారికే కష్టాలు వస్తాయన్న చందంగా అదే ఏడాది ఆమె కరోనా బారిన పడ్డారు.

కరోనా మహమ్మారి నుంచి బయడపడే టైమ్​లో శిఖా శర్మకు బ్రెయిన్​ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఆమె శరీర కుడిభాగం పక్షవాతానికి లోనైంది. ట్రీట్​మెంట్​లో భాగంగా ఆమె స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా శిఖ కొంత లావెక్కారు కూడా. దీంతో ఆమె కలత చెందారు. తిరిగి మునుపటిలా మారాలని సంకల్పించుకున్నారు. ఆమె దృఢ సంకల్పం ముందు పక్షవాతమూ పారిపోయింది. చావుబతుకుల నుంచి సాధారణ స్థితికి చేరుకున్న శిఖ.. మళ్లీ పూర్తి ఫిట్​గా మారారు. తాజాగా ఇన్​స్టాగ్రామ్​లో ఆమె తన బికినీ ఫొటోలను షేర్ చేశారు. శిఖ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె జర్నీ అందరికీ ఎంతో ఆదర్శప్రాయం అని నెటిజన్స్ అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Jojobet GirişmeritbetmeritbetjojobetHoliganbet girişjojobetJojobet GirişcasibomjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet giriş