iDreamPost
android-app
ios-app

వివాహేతర సంబంధాలు తప్పుకాదు.. స్టార్ నటి షాకింగ్ కామెంట్స్

  • Published Aug 20, 2024 | 1:18 PM Updated Updated Aug 20, 2024 | 1:18 PM

ఈ మధ్య కాలంలో వివాహ బంధాన్ని తూట్లు పొడుస్తున్నాయి వివాహేతర సంబంధాలు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఓ నటి ఎఫైర్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.

ఈ మధ్య కాలంలో వివాహ బంధాన్ని తూట్లు పొడుస్తున్నాయి వివాహేతర సంబంధాలు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఓ నటి ఎఫైర్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.

  • Published Aug 20, 2024 | 1:18 PMUpdated Aug 20, 2024 | 1:18 PM
వివాహేతర సంబంధాలు తప్పుకాదు.. స్టార్ నటి షాకింగ్ కామెంట్స్

మూడు ముళ్లతో, ఏడు అడుగులతో యువతీ, యువకుల్ని ఏకం చేసేదే వివాహ బంధం. వివాహ బంధం అంటే నమ్మకం, విశ్వాసం. కానీ నేడు ఈ బంధాన్ని తూట్లు పొడుస్తున్నాయి వివాహేతర సంబంధాలు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా అక్రమ సంబంధాలు నెరుపుతూ ఈ మధ్య వార్తల్లో నిలిచిన సంగతి విదితమే. కన్నడ స్టార్ హీరో దర్శన్.. ప్రియురాలు పవిత్ర గౌడ కోసం ఓ హత్య చేసి ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు. అలాగే కన్నడ యంగ్ హీరో యువ రాజ్ కుమార్ వైవాహిక జీవితం కూడా ఇలాంటి వ్యవహారం వల్లే సంసారం చట్టుబండలు అయ్యింది. ఈ వివాహేతర సంబంధంపై విమర్శలు వస్తున్న వేళ.. ఓ స్టార్ నటి ఈ రోజుల్లో ఎఫైర్స్ పెట్టుకోవడం తప్పుకాదు అంటూ కాంట్రవర్సీయల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.

ప్రముఖ మాలీవుడ్ నటి షీలూ అబ్రహం.. వివాహేతర సంబంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. వివాహేతర సంబంధాలకు పాల్పడే వారిని ఎప్పుడూ నిందించకూడదని అంటూ కామెంట్స్ చేసింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాహేతర సంబంధాలపై మాట్లాడుతూ… ‘ వైవాహిక జీవితంలో కొన్ని పొరపాట్ల వల్ల ఎఫైర్స్ మొదలౌతాయి అలాంటి బంధాన్ని తప్పని చెప్పలేం. ఇవన్నీ వారి వ్యక్తిగత స్వేచ్ఛ, సోషల్ మీడియాలో చర్చకు రాకూడదు. అలాగే అత్యాచారం తప్పు. అలాగే ఏకాభిప్రాయంతో జరిగే రొమాన్స్ తప్పు కాదు. కానీ ఇష్ట ప్రకారం శారీరకంగా ఒక్కటై.. దాన్ని రేప్ అని క్లెయిమ్ చేయడం సరికాదు. అలాగే సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ గురించి ప్రజలకు నేరుగా తెలియకపోయినా.. పుకార్లు.. కొన్ని వార్తల ద్వారా తెలుస్తున్నాయి’ అన్న అభిప్రాయాం వ్యక్తం చేసింది

గతంలో ప్రియా వారియర్ నటించిన ఒరు అదార్ లవ్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఒమర్ లులుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి మోసం చేసి, ఆ తర్వాత శారీరక సంబంధం పెట్టుకున్నాడన్న వ్యవహారంపై కేసు నమోదైంది. దీనిపై షీలూ మాట్లాడుతూ..‘ ఒమర్ లులు మంచివాడా కాదా అని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేను. అయితే ఈ రోజు స్త్రీ పురుషుల మధ్య ఎఫైర్స్ సర్వసాధారణం. వీరి మధ్య విబేధాలు ఏర్పడినప్పుడు అది అసూయ, ద్వేషం ఏర్పడి ఇలాంటి కేసులకు దారితీస్తుంది. ఒమర్ లులు నాకు చాలా సన్నిహిత స్నేహం ఉంది. అయితే ఇలాంటి విషయాల్లో మహిళలు జాగ్రత్తగా ఉండాలని నేను చెప్పదలుచుకున్నాను’అంటూ వెల్లడించింది. ఈ కేసు వల్ల ‘బ్యాడ్ బాయ్స్’ సినిమా ఎఫెక్ట్ అవుతుందని తెలిపింది

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetmeritbetcasibomiptv satın alCasibomcasibom