iDreamPost
android-app
ios-app

షారూఖ్ ఖాన్ ని చంపుతాం అని బెదిరింపులు.. భారీ భద్రత ఏర్పాట్లు!

  • Published Oct 09, 2023 | 11:38 AM Updated Updated Oct 09, 2023 | 11:38 AM
  • Published Oct 09, 2023 | 11:38 AMUpdated Oct 09, 2023 | 11:38 AM
షారూఖ్ ఖాన్ ని చంపుతాం అని బెదిరింపులు.. భారీ భద్రత ఏర్పాట్లు!

ఇటీవల సినీ, రాజకీయ, వ్యాపార వేత్తలకు కొంతమంది బాంబు బెదిరింపు కాల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తమిళ హీరోలు అజిత్, సీఎం స్టాలిన్ కి ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి.. వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అవి ఫేక్ కాల్స్ అని తేలిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తరుచూ ఇలాంటి బెదిరింపు కాల్స్ వల్ల పోలీసులు వెంటనే అప్రమత్తమైన సదరు సెలబ్రెటీలకు హై సెక్యూరిటీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ని హత్య చేస్తామని పలువురు బెదిరించడంతో ప్రభుత్వం ఆయనకు హై సెక్యూరిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి బెదిరింపు కాల్స్ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ లో కొంత కాలంగా హీరో షారూఖ్ ఖాన్ నటించిన చిత్రాలు పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయి. ఈ ఏడాది ఆయన నటించిన పఠాన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. కనీ వినీ ఎరుగని రీతిలో ఏకంగా వెయ్యి కోట్లు వసూళ్లు చేసినట్లు ఇండస్ట్రీ టాక్. ఇంత పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న షారూఖ్ ఖాన్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘జవాన్’ మరో బాక్సీఫీస్ హిట్ కావడంతో షారూఖ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాలపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే షారూఖ్ ఖాన్ ని చంపేస్తామని బెదిరింపు కాల్స్ రావడంతో తనకు సెక్యూరిటీ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆయన భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. షారూఖ్ ఖాన్ కి మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా Y + సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. హై-పవర్ కమిటీ సిఫార్సులను అనుసరించి ఆయనకు Y + భద్రతను అప్ గ్రేడ్ చూసినట్లు అధికారులు తెలిపారు. షారూఖ్ కి రాష్ట్ర వీఐపీ సెక్యూరిటీ యూనిట్ కి చెందిన ఆరుగురు ట్రెండ్ కమాండోల బృందం ఆయన వెంటనే ఉంటుంది. సెక్యూరిటీ నేపథ్యంలో షారూఖ్ కి 11 మందితో భద్రతను ఏర్పాటు చేయనున్నారు. బంగ్లా పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అపరిచితులు సంచరిస్తే అలర్ట్ అవుతారు. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఎంపీ-5 మెషిన్ గన్స్, ఏకే 47 అస్సాల్ట్ రైఫిల్స్, గ్లోక్ పిస్టల్స్ లాంటి అత్యాధునిక ఆయుధాలు ఉంటాయని తెలుస్తుంది. షారూఖ్ ఖాన్ భద్రతతో పాటు ఆయన నివాసం మన్నత్ చుట్టుపక్కల కూడా 24/7 పోలీసుల పర్యవేక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు. వీరితో పాటు షారూఖ్ సొంత బాడీగార్డ్స్ ఆయనకు ఎప్పుడు రక్షణగా ఉంటారన్న విషయం తెలిసిందే.