iDreamPost
android-app
ios-app

షణ్ముఖ్ కేసులో సంచలన నిజాలు! అవకాశాలు ఇప్పిస్తానని లైంగికంగా: మౌనిక!

  • Published Feb 22, 2024 | 1:35 PM Updated Updated Feb 22, 2024 | 1:37 PM

Shanmukh Jaswanth: యూట్యూబర్‌, బిగ్‌ బాస్‌ రన్నరప్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ గంజాయి కేసులో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాధితురాలు సంచలన నిజాలు వెల్లడించింది. ఆ వివరాలు..

Shanmukh Jaswanth: యూట్యూబర్‌, బిగ్‌ బాస్‌ రన్నరప్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ గంజాయి కేసులో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాధితురాలు సంచలన నిజాలు వెల్లడించింది. ఆ వివరాలు..

  • Published Feb 22, 2024 | 1:35 PMUpdated Feb 22, 2024 | 1:37 PM
షణ్ముఖ్ కేసులో సంచలన నిజాలు! అవకాశాలు ఇప్పిస్తానని లైంగికంగా: మౌనిక!

యూట్యూబర్‌, బిగ్‌ బాస్‌ 5 సీజన్‌ రన్నరప్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ గంజాయి కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. షణ్ముఖ్‌ సోదరుడిపై వచ్చిన ఓ ఫిర్యాదు కారణంగా.. అతడు కూడా అరెస్ట్‌ అయ్యాడు. ఇక ఈ కేసులో బాధితురాలిగా ఉన్న మౌనిక సంచలన నిజాలు వెల్లడించింది. యూట్యూబ్‌లో అవకాశం ఇప్పిస్తానని షణ్ముఖ్‌, పెళ్లి పేరుతో లైంగికంగా వాడుకుని అతడి అన్న సంపత్‌ వినయ్‌ ఇద్దరు తనను మోసం చేశారని చెప్పుకొచ్చింది మౌనిక. ఆమె వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

విజయవాడకు చెందిన డాక్టర్‌ మౌనికకు మూడేళ్ల క్రితం షణ్ముక్‌ అన్న సంపత్‌తో పరిచయం అయ్యింది. మౌనికను ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సంపత్‌.. ఆమెని హోటల్స్‌, విల్లాలకు తీసుకెళ్లి లోబర్చుకున్నాడు. ఒకసారి అబార్షన్‌ కూడా చేయించాడు. అయితే ఈ విషయాలేవి బయటపెట్టడకూడదని బెదిరించాడని బాధితురాలు మౌనిక చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకోమని అడిగితే.. చేతికి ఓ ఉంగరం తొడిగి వివాహం అయ్యిందని చెప్పాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి నిశ్చితార్థం జరిగింది.

కానీ మౌనిక తల్లి క్యాన్సర్‌ బారిన పడటంతో ఆమె చికిత్స కారణంగా వీరి వివాహం పోస్ట్‌ పోన్‌ అవుతూ వస్తోంది. ఇక తాజాగా మౌనిక-సంపత్‌లు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించి.. పెళ్లికి ముహుర్తం కూడా పెట్టుకున్నారు. వీరి వివాహానికి మరో ఆరో రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ ఈలోపే సంపత్‌.. మరో యువతిని వివాహం చేసుకున్నాడు.

తాను మోసపోయానని తెలుసుకున్న మౌనిక నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. వారు సంపత్‌ కోసం అతడి ఇంటికి వెళ్లగా.. అదే సమయంలో షణ్ముఖ్‌, అతడి అన్నతో కలిసి గంజాయి తాగుతూ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే అన్నదమ్ములు చాలా కాలం నుండి గంజాయి వాడుతున్నారని.. వారి దగ్గర డ్రగ్స్ పిల్స్ కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది మౌనిక.

యూట్యుబ్‌లో షార్ట్‌ ఫిల్మ్స్‌ చేస్తూ.. ఎంతో గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్‌.. ఆ క్రేజ్‌తో బిగ్‌ బాస్‌ సీజన్‌ 5లో కంటెస్టెంట్‌గా వెళ్లాడు. ప్రారంభంలో అందరూ అతడే బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 విన్నర్‌ అని భావించారు. కానీ హౌజ్‌లో అతడి అతి, సిరితో మెలిగిన విధానం చాలా మందికి నచ్చలేదు. యూట్యూబర్‌గా ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడో.. బిగ్‌ బాస్‌లోకి వెళ్లి.. అంత చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. ఇక తాజాగా గంజాయి కేసులో పట్టుబడ్డాడు.