iDreamPost
android-app
ios-app

ఆ స్టార్ హీరోతో దర్శకుడు శంకర్ క్రేజీ ప్రాజెక్టు ఆగిపోయింది

  • Published Jul 03, 2024 | 1:01 PM Updated Updated Jul 03, 2024 | 1:01 PM

ప్రముఖ దర్శకుడు శంకర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇండియన్ 2తో త్వరలో రాబోతున్నాడు. జులై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఓ కీలక అప్డేట్ ఇచ్చాడు శంకర్. ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్లు వెల్లడించాడు.

ప్రముఖ దర్శకుడు శంకర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇండియన్ 2తో త్వరలో రాబోతున్నాడు. జులై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఓ కీలక అప్డేట్ ఇచ్చాడు శంకర్. ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్లు వెల్లడించాడు.

  • Published Jul 03, 2024 | 1:01 PMUpdated Jul 03, 2024 | 1:01 PM
ఆ స్టార్ హీరోతో దర్శకుడు శంకర్ క్రేజీ ప్రాజెక్టు ఆగిపోయింది

మణిరత్నం తర్వాత పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకున్న మరో కోలీవుడ్ దర్శకుడు శంకర్. తన చిత్రాలతో సోషల్ మేసేజ్ అందిస్తూ.. ప్రేక్షకులను కనువిందు చేస్తాడు. టెక్నాలజీని వినియోగిండంతో ఆయనకు మించిన దర్శకులు లేరేమో అనిపిస్తూ ఉంటుంది. సినిమా సినిమాకు  గ్యాప్ ఎక్కువ తీసుకున్నప్పటికీ.. కొన్నాళ్ల పాటు నిలిచిపోయే చిత్రాలను తెరకెక్కిస్తుంటారు. అయితే ఈ సారి చాలా గ్యాపే తీసుకున్నారు. రోబో 2.0 తర్వాత ఆయన నుండి సినిమా రాలేదు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రాలను ఏకకాలంతో తెరకెక్కించడంతో ఈ గ్యాప్ వచ్చింది. జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే భారతీయుడు పార్ట్ 3 కూడా రాబోతుంది. ఇండియన్ 2 కోసం ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు శంకర్.

ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ చేస్తారో చెప్పలేదు శంకర్. దిల్ రాజుతో పాటు శంకర్‌కు ఎప్పుడు సినిమా రాబోతుందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు చెర్రీ ఫ్యాన్స్. ఇదిలా ఉంటే శంకర్ తన అప్ కమింగ్ ప్రాజెక్టుపై కీలక అప్డేట్ ఇచ్చారు. ఆయన తెరకెక్కించబోతున్న ఓ సినిమా ఆగిపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా శంకరే వెల్లడించారు. కొంత కాలం క్రితం శంకర్.. బాలీవుడ్ హీరో, దీపికా పడుకొనే భర్త రణవీర్ సింగ్‌తో ఓ సినిమా తెరకెక్కించాలని అనుకున్నారు. అదే విక్రమ్ హీరోగా నటించిన అపరిచితుడు. గతంలో అన్నియన్ (తెలుగులో అపరిచితుడు) మూవీని రణబీర్ సింగ్‌తో రీమేక్ చేయాలనుకోగా.. ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్లు వెల్లడించాడు.

‘రణవీర్‌తో అన్నియని రీమేక్ చేయాలని ప్లాన్ చేశాం. కానీ ఆ తర్వాత మా ఆలోచనలు మారాయి. భారీ బడ్జెట్‌తో మరో సినిమా చేద్దాం అని, అది అన్నియన్ కంటే భారీగా ఉండాలని నిర్మాతలు కోరారు. చర్చలు జరుగుతున్నాయి. ఇండియన్2 , గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 తర్వాత ఆ ప్రాజెక్టు ఉంటుంది’ అని చెప్పారు శంకర్. ఇక రణవీర్ తెలుగులో కూడా హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో సినిమా ప్లాన్ చేశాడు. ఇద్దరు కూడా స్టోరీ డిస్కషన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ అంతలో ఆ మూవీ కూడా ఆగినట్లు అఫియల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రణవీర్- ప్రశాంత్ కాంబోలో మూవీని నిర్మించడానికి సన్నాహాలు చేసింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగింది. కానీ రణవీర్ సింగ్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş