Krishna Kowshik
ఈ ఫోటోలో బానపొట్ట, మాసిన గడ్డం, కళ్లజోడుతో కనిపిస్తున్న ఈ హీరోను గుర్తు పట్టారా..? అమ్మాయిల క్రష్. అతడి స్మైల్, స్టైల్ చూసి ఫ్లాట్ అయిపోయేవారంతే. ఇంతకు ఆ నటుడు ఎవరో చెప్పుకోండి చూద్దాం.
ఈ ఫోటోలో బానపొట్ట, మాసిన గడ్డం, కళ్లజోడుతో కనిపిస్తున్న ఈ హీరోను గుర్తు పట్టారా..? అమ్మాయిల క్రష్. అతడి స్మైల్, స్టైల్ చూసి ఫ్లాట్ అయిపోయేవారంతే. ఇంతకు ఆ నటుడు ఎవరో చెప్పుకోండి చూద్దాం.
Krishna Kowshik
ఇండస్ట్రీలో మెథడ్ యాక్టర్స్ చాలా అరుదుగా కనిపిస్తుంటారు. సినిమా కోసం ప్రాణం పెట్టేస్తుంటారు. నటన అంటే ఫ్యాషన్ అండ్ పిచ్చితో అడుగుపెట్టి సత్తా చాటుతుంటారు. మూవీ మూవీకి వేరియేషన్స్ కోసం పరితపిస్తూ ఉంటారు. వర్సటైల్ యాక్టర్ అనిపించుకునేందుకు సినిమాకు తగ్గట్లుగా మేకోవర్ అవుతుంటారు. దీని కోసం జిమ్‌లో కసర్తతులు, ఫుడ్‌లో మార్పులు చేసుకుంటారు. శరీరాన్ని ఇబ్బందికి గురి చేస్తుంటారు. క్యారెక్టర్ కోసం తమను తాము ఓన్ చేసుకునే వారు కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇలాంటి వారిని కళామతల్లి ఆదరించడమే కాదు.. కష్టపడితే ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అని నిరూపిస్తుంది. ఇందుకు ఉదాహరణ ఈ నటుడే. ఈ ఫోటోలో బాన పొట్టతో..కళ్ల జోడు పెట్టుకుని బొద్దుగా కనిపిస్తున్న ఇతగాడు ఎవరో తెలుసా..?
ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు. ఒక్క మూవీతోనే నేషనల్ క్రష్ అయ్యాడు. నటనతోనే కాదు నవ్వు, స్టైలిష్ అవుట్ ఫిట్స్‌తో పిచ్చేక్కించేశాడు. విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కుర్రాళ్లు ఇతడిలా ఉండాలనుకునే వారు. ఈ హీరో వేసుకున్న దుస్తులు ప్రతిదీ కాపీ చేయడానికి ప్రయత్నించేవారు. అంతలా అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఆకట్టుకున్న నటుడు ఎవరో తెలుసా.. ఆర్. మాధవన్. 2000వ దశకంలో ఇతడికి ఉన్న లేడీ ఫాలోయంగ్ మరో హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. మ్యాడీ హెయిర్ కట్, స్మైల్‌కి మ్యాడ్ ఎక్కిపోయేవారు. మణిరత్నం సఖి మూవీతో క్లిక్ అయిన మాధవన్..మిన్నాలే (చెలి) మూవీతో మరింత స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఈ రెండు సినిమాల్లోని పాటలు ఇప్పటికీ ఎంతో మంది హాట్ ఫేవరేట్స్.
తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ఎదిగిన మ్యాడీ.. తెలుగులో నేరుగా సినిమాలు చేయకపోయినప్పటికీ.. డబ్బింగ్ చిత్రాలతోనే ఇక్కడ పరిచమయ్యాడు. 1998 నుండి హీరోగా కొనసాగిన ఆయన ప్రయాణం అప్రతిహతంగా సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో ఓం శాంతిలో స్పెషల్ అపీరియన్స్ ఇచ్చాడు. ఆయన తొలి తెలుగు సినిమా నాగ చైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచి. దీనితో పాటు బైలింగ్వల్ నిశ్శబ్దం చిత్రాలు చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్‌లో హీరోగా అలరించి.. సెకండ్ ఇన్నింగ్స్‌లో హీరోతో పాటు విలన్ గా అదరగొడతున్నాడు. అయితే విలన్ రోల్‌లో డ్రీమ్ బాయ్ ను చూడలేకపోయారు ఓ జనరేషన్ మహిళలు.
ఇప్పుడు డిఫరెంట్ చిత్రాలను ఎంచుకుంటూ దూసుకెళుతున్నాడు. రాకెట్రీ.. సైతాన్ హిట్లతో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం మాధవన్ చేతిలో ఐదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 2000 ఎరాలో కెరీర్ స్టార్ చేసిన ఏ హీరోకు కూడా ఇన్ని ప్రాజెక్టులు ఉన్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాడు కానీ ఒకప్పుడు అలా అయిపోయాడట మాధవన్. ఎలాంటి ఎక్స్ సైజ్, రన్నింగ్, సర్జరీ, ఎలాంటి మెడికేషన్ లేకుండా ఫుడ్ ద్వారా తగ్గినట్లు చెప్పుకొచ్చాడు.