iDreamPost
android-app
ios-app

షారుఖ్.. జవాన్ మూవీ అరుదైన రికార్డు! వైరలవుతున్న అట్లీ పోస్ట్..

  • Published Jun 06, 2024 | 9:12 PM Updated Updated Jun 06, 2024 | 9:12 PM

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గతేడాది నటించిన చిత్రం జవాన్. థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం తాజాగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గతేడాది నటించిన చిత్రం జవాన్. థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం తాజాగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jun 06, 2024 | 9:12 PMUpdated Jun 06, 2024 | 9:12 PM
షారుఖ్.. జవాన్ మూవీ అరుదైన రికార్డు! వైరలవుతున్న అట్లీ పోస్ట్..

‘జవాన్’.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో గతేడాది వచ్చిన చిత్రం. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ.. కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ సినిమా. ఏకంగా రూ. 1000 కోట్లను కొల్లగొట్టింది జవాన్. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో మెరిశారు. కాగా.. ఈ మూవీ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇందుకు సంబంధించి డైరెక్టర్ అట్లీ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ క్రేజీ రికార్డును సొంతం చేసుకుంది. 2023 సంవత్సరంలో గూగుల్ లో ఎక్కువ మంది వెతికిన సినిమాల జాబితాలో జవాన్ చోటు దక్కించుకుంది. వరల్డ్ వైడ్ గా అత్యధిక మంది సెర్చ్ చేసిన సినిమాల లిస్ట్ లో జవాన్ మూడో ప్లేస్ లో నిలిచింది. ఈ విషయాన్ని అట్లీ ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఇక ఈ జాబితాలో అగ్రస్థానంలో హాలీవుడ్ చిత్రమైన బార్బీ నిలిచింది. సెకండ్ ప్లేస్ లో ఓపెన్ హైమర్ ఉంది. జవాన్ తో పాటుగా మరో రెండు బాలీవుడ్ మూవీస్ టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. గదర్ 2, పఠాన్ వరుసగా 8, 10 స్థానాలను దక్కించుకున్నాయి. ఈ వివరాలను వరల్డ్ ఆఫ్ స్టాటటిక్స్ రిలీజ్ చేసింది. అయితే ఈ లిస్ట్ లో తెలుగు సినిమాలు లేకపోవడం బాధాకరమైన విషయం. మరి జవాన్ మూవీ రేర్ రికార్డు సాధించడంపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet