iDreamPost

Prasanth Varma: హనుమాన్ డైరెక్టర్ వద్ద ఫుల్ టైమ్ జాబ్.. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు ట్రై చేయండి!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దగ్గర పనిచేయాలన్న ఇంట్రెస్ట్ మీకుందా? అయితే ఈ ఛాన్స్ మీకోసమే. ఆయనే స్వయంగా తన దగ్గర ఫుల్ టైమ్ జాబ్ ఉందని అనౌన్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దగ్గర పనిచేయాలన్న ఇంట్రెస్ట్ మీకుందా? అయితే ఈ ఛాన్స్ మీకోసమే. ఆయనే స్వయంగా తన దగ్గర ఫుల్ టైమ్ జాబ్ ఉందని అనౌన్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Prasanth Varma: హనుమాన్ డైరెక్టర్ వద్ద ఫుల్ టైమ్ జాబ్.. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు ట్రై చేయండి!

ప్రశాంత్ వర్మ.. ‘హనుమాన్’ మూవీతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ను దక్కించుకున్నాడు. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ ను తెరకెక్కిస్తున్నాడు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన హనుమాన్ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం 40 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 400 కోట్ల వరకు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో ప్రశాంత్ వర్మ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. పెద్ద పెద్ద నిర్మాతలు అతడితో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ తన వద్ద జాబ్ ఉందని ప్రకటించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్నాడు. హనుమాన్ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్.. దానికి సీక్వెల్ ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ‘జై హనుమాన్’ ను భారీ లెవల్లో నిర్మించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన రెండు పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హాలీవుడ్ మూవీని తలపించేలా ఆ పోస్టర్లు ఉన్నాయి.

ఇదంతా కాసేపు పక్కన పెడితే.. ప్రశాంత్ వర్మ తన దగ్గర ఫుల్ టైమ్ జాబ్ ఉందంటూ ఆఫర్ చేశాడు. “మేము పోస్టర్ డిజైనర్స్ కోసం చూస్తున్నాం. ఇది ఫుల్ టైమ్ జాబ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు talent@thepvcu.com ద్వారా మమ్మల్ని సంప్రదించండి” అంటూ ట్విట్టర్ ద్వారా జాబ్ ఆఫర్ చేశాడు. ఇక ప్రశాంత్ వర్మ ప్రకటనకు నెటిజన్ల నుంచి భారీగానే రెస్పాన్స్ వస్తోంది. ఆసక్తి ఉన్నవారు, ప్రశాంత్ వర్మతో కలిసి పనిచేయాలని ఉన్నవారు ఈ సదావకాశాన్ని వదులుకోకండి. అర్హులు అయిన వారు వెంటనే అప్లై చేసుకోండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి