iDreamPost
android-app
ios-app

కరీనా కపూర్ తో లిప్ లాక్ వీడియో లీక్.. స్పందించిన హీరో!

  • Author ajaykrishna Published - 06:16 PM, Mon - 10 July 23
  • Author ajaykrishna Published - 06:16 PM, Mon - 10 July 23
కరీనా కపూర్ తో లిప్ లాక్ వీడియో లీక్.. స్పందించిన హీరో!

సెలబ్రిటీల సినిమాలకు సంబంధించి ఎలాంటి వార్తలు బయటికి వచ్చినా పెద్దగా పట్టించుకోరేమో. కానీ.. వాళ్ళ పర్సనల్ లైఫ్ కి సంబంధించి చిన్న విషయాలు లీకైనా తట్టుకోలేరు. ఎందుకంటే.. వ్యక్తిగతం అంటే ఎవరైనా సీక్రెట్ గా ఉండాలనే కోరుకుంటారు. కానీ.. వాళ్ళకే తెలియకుండా పర్సనల్ విషయాలే కాదు.. ప్రైవేట్ వీడియోస్ బయటికి వస్తే ఎలా ఉంటుంది? ఆ పెయిన్ వేరే లెవెల్ లో ఉంటుంది. పైగా ఆ స్థానంలో ఉన్నది సినిమా స్టార్ అయినా.. కామన్ మ్యాన్ అయినా పెయిన్ భరించలేరు. అందులోనూ ఆ ప్రైవేట్ వీడియోస్ మీడియా కంటబడి.. ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తే.. ఆ వీడియోపై నేషనల్ లెవెల్ లో డిబేట్స్.. న్యూస్.. ట్రోల్స్ ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది.

ఇవన్నీ తాను 24 ఏళ్ళ వయసులోనే ఫేస్ చేసానని.. ఆ వీడియో ఎలా బయటికి వచ్చిందో ఇప్పటికి తనకు తెలియదని అంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్. ఇంతకీ షాహిద్ కి సంబంధించి ఏం వీడియో లీక్ అయ్యిందో తెలుసా..? హీరోయిన్ కరీనా కపూర్ ని కిస్ చేస్తున్న వీడియో ఎంఎంఎస్. కరీనాకు సైఫ్ తో పెళ్ళి కాకముందు షాహిద్ తో దాదాపు పదేళ్లు డేటింగ్ చేసింది. ఆ తరువాత ఏమైందో గాని ఇద్దరూ బ్రేకప్. చెప్పుకొని విడిపోయారు. అయితే.. వీరిద్దరూ లవ్ లో ఉన్నప్పుడు పబ్లిక్ రొమాన్స్ తో చాలా ట్రోల్స్ ఫేస్ చేశారు. కట్ చేస్తే.. 2004లో కరీనా, షాహిద్ కిస్ చేసుకున్న ఎంఎంఎస్ వీడియో లీక్ అయింది. అప్పట్లో అది సెన్సేషనల్ గా మారింది. ఆ వీడియో కారణంగా తాను ఎంతో సఫర్ అయ్యానని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు షాహిద్.

2004 టైంలో సోషల్ మీడియా లేదు. జబ్ వి మెట్ మూవీ సెట్స్ లో షాహిద్, కరీనా కిస్ చేసుకున్న ఎంఎంఎస్ వీడియో కొన్నాళ్ళపాటు హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో అది మార్ఫింగ్ చేసిన క్లిప్ అని షాహిద్, కరీనా కొట్టిపారేసారు. కానీ.. రీసెంట్ గా షాహిద్ కపూర్ మిడి డేతో.. MMS లీక్ అయ్యాక నా లైఫ్ నాశనం అయినంత పనైందని అన్నాడు. షాహిద్ మాట్లాడుతూ.. “అప్పుడు నాకు 24 ఏళ్లు. నా ప్రైవసీ పై దాడి జరిగింది. ఆ టైంలో బాధ పడటం తప్ప వేరే ఏమి చేయలేకపోయాను. ఆ వీడియో నా లైఫ్ లో పెద్ద గందరగోళం సృష్టించింది. కొన్నాళ్ళు అదే ఆలోచిస్తూ ఉండిపోయాను” అని చెప్పాడు. ఇన్నేళ్ల తర్వాత అయినా ఆ ఎంఎంఎస్ గురించి షాహిద్ స్పందించడంతో నెటిజన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet GirişmeritbetcasibomJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetgar girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel