iDreamPost
android-app
ios-app

అమెరికాకు షిఫ్ట్ అవుతున్న శివకుమార్! మరి ప్రియాంక?

  • Published Jan 13, 2024 | 10:11 PM Updated Updated Jan 13, 2024 | 10:11 PM

Shiva Kumar- Priyanka Jain: బుల్లితెర ప్రేక్షకులకు ప్రియాంక- శివకుమార్ జోడీ బాగా తెలుసు. ఇప్పుడు ఓ వార్తతో శివకుమార్ ఫ్యాన్స్ కి షాకిచ్చాడు.

Shiva Kumar- Priyanka Jain: బుల్లితెర ప్రేక్షకులకు ప్రియాంక- శివకుమార్ జోడీ బాగా తెలుసు. ఇప్పుడు ఓ వార్తతో శివకుమార్ ఫ్యాన్స్ కి షాకిచ్చాడు.

  • Published Jan 13, 2024 | 10:11 PMUpdated Jan 13, 2024 | 10:11 PM
అమెరికాకు షిఫ్ట్ అవుతున్న శివకుమార్! మరి ప్రియాంక?

ప్రియాంక జైన్- శివకుమార్ జోడీకి బుల్లితెరలో చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. వీరిని సీరియల్ లో చూసి ఇష్టపడటమే కాకుండా.. రియల్ లైఫ్ లో జోడీ అని తెలిశాక ఇంకా ఎక్కువ అభిమానిస్తున్నారు. సీరియల్స్ లోనే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా ఈ జంటకు మంచి ఫాలోయింగే ఉంది. ఇటీవల ప్రియాంక జైన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో మెరిసిన విషయం తెలిసిందే. తన ఆట, టాలెంట్, మాటలతో ప్రేక్షకులను అలరిచింది. ఇంకా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. వీళ్లు షో తర్వాత పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అంటూ ప్రకటించారు. ఇలాంటి తరుణంలో ఇది ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీకెండ్ ఎంత ఎమోషనల్ సాగిందో అందరికీ తెలిసిందే. ఆ వీక్ మొత్తం షో టీఆర్పీ ఆకాశాన్ని తాకింది. అంతలా క్లిక్ అవ్వడంలో ఈ జోడీ పాత్ర కూడా ఉంది. ప్రియాంక కోసం శివకుమార్ హౌస్ లోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ ప్రేమ జంటను చూసి ఎంతో మంది మురిసిపోయారు. అయితే హౌస్ లో శివకుమార్ ప్రియాంకకు కొన్ని విషయాలు చెప్పాడు. ప్రియాంకకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ ఉందని చెప్పాడు. అందులో గుడ్ న్యూస్.. షో తర్వాత పెళ్లి చేసుకుందామన్నాడు. అయితే బ్యాడ్ న్యూస్ ఏంటనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే శివకుమార్ త్వరలోనే అమెరికా వెళ్లబోతున్నాడు.

తన అమెరికా యాత్రకు సంబంధించిన వీసా కూడా వచ్చేసినట్లు వెల్లడించాడు. తాను అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని.. తనకు వీసా వచ్చిన సంగతిని కూడా తెలిపాడు. ప్రియాంక కాళ్లు మొక్కి మరీ వెళ్లాను అన్నాడు. అమ్మ, ప్రియాంక ఆశీర్వాదం వల్లే తనకు వీసా వచ్చిందంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే వెకేషన్ కోసం వెళ్తున్నాడా? అక్కడే సెటిల్ అవుతాడా? ఏంటి అనే విషయాలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వీసా ఇంటర్వ్యూకి సంబంధించి కూడా కామెంట్స్ చేశాడు. ఎందుకు న్యూయార్క్ వెళ్లాలి అనుకుంటారని అడగ్గా.. తాను తెలుగు ఇండస్ట్రీలో పని చేస్తున్నాని, సీరియల్ పూర్తయ్యిందని చెప్పానన్నాడు. రెండు నెలలుగా ఖాళీగా ఉంటున్నాను. ఈ గ్యాప్ న్యూయార్క్ వెళ్లి రావాలి అనుకుంటున్నాను అని చెప్పినట్లు తెలిపాడు.

వార్షిక జీతమెంత? ఎవరెవరు వెళ్తున్నారని అడగ్గా.. సమాధానం ఇచ్చానన్నాడు. మొత్తానికి కేవలం 20 సెకన్లలోనే తనకి వీసా వచ్చిందంటూ చెప్పాడు. శివకుమార్ సీరియల్ అయిపోయింది. ప్రస్తుతం 2 నెలలు మాత్రం ఖాళీగానే ఉంటున్నట్లు వెల్లడించాడు. అయితే అమెరికాలో సెటిల్ అయ్యే ఉద్దేశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శివకుమార్ అక్కడ సెటిల్ అయితే ప్రియాంక కూడా అక్కడికే వెళ్లాలి కదా? అంటే ఆమె యాక్టింగ్ మానేస్తుందా? అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రియాంకకోసం కూడా వీసా అప్లయ్ చేయాలని శివకుమార్ చెప్పాడు. తనకి ఎన్ని అటెంప్ట్స్ లో వీసా వస్తుందో చూడాలి అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం వీళ్ల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఎందుకు శివకుమార్ అమెరికా వెళ్తున్నాడు అనే విషయంపై మాత్రం ఆ వీడియోలో క్లారిటీ ఇవ్వలేదు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetador girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom