iDreamPost
android-app
ios-app

వైరల్ ఫొటోలు: బుల్లితెర నటి ఇంట బారసాల వేడుక!

  • Published May 10, 2024 | 5:46 PM Updated Updated May 10, 2024 | 5:46 PM

Serial Artist Maheshwari- Baby Barasala: బుల్లితెర నటి మహేశ్వరి- శివనాగ్ దంపతుల గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్స్ లోనే కాకుండా నెట్టింట కూడా వారి సందడి నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ఇప్పుడు మహేశ్వరి దంపతుల ఇంట వేడుకల జరిగాయి.

Serial Artist Maheshwari- Baby Barasala: బుల్లితెర నటి మహేశ్వరి- శివనాగ్ దంపతుల గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్స్ లోనే కాకుండా నెట్టింట కూడా వారి సందడి నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ఇప్పుడు మహేశ్వరి దంపతుల ఇంట వేడుకల జరిగాయి.

  • Published May 10, 2024 | 5:46 PMUpdated May 10, 2024 | 5:46 PM
వైరల్ ఫొటోలు: బుల్లితెర నటి ఇంట బారసాల వేడుక!

‘అమ్మ’ కావాలి అని ప్రతి ఒక్క మహిళకు ఉంటుంది. 9 నెలలు మోసి, కని, ఆ చిన్నారిని పొత్తిళ్లలోకి తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకోవాలి అని ఆశ పడతారు. అందుకు సెలబ్రిటీలు ఏమీ అతీతులు కారు. వాళ్లు కూడా ఒకవైపు తమ ప్రొఫెషన్ ను మేనేజ్ చేసుకుంటూ.. మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని కూడా కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారు. ఇప్పటికే గతంలో ఓసారి తల్లైన బుల్లితెర నటి మహేశ్వరి.. మరోసారి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే నటి మహేశ్వరి బాబుకు జన్మనిచ్చింది. అందుకు సంబంధించి వివరాలను వారే అధికారికంగా వారి వారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా ఆ చిన్నారికి బారసాల చేశారు.

బుల్లితెర నటి మహేశ్వరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేశ్వరి.. వదినమ్మ, శశిరేఖా పరిణయం వంటి ఎన్నో ఫేమస్ సీరియల్స్ లో తెలుగు ప్రేక్షకులను అలరించింది. మరోవైపు సోషల్ మీడియా, యూట్యూబ్ లో కూడా ఈ జంట సందడి చేస్తూనే ఉంటుంది. కుమార్తె, భర్తతో కలిసి చేసే అల్లరి, సందడి మొత్తాన్ని వీడియోల రూపంలో విడుదల చేస్తూ ఉంటారు. మహేశ్వరి దంపతులు సీరియల్స్ మాత్రమే కాకుండా.. రియాలటీ షోస్ లో కూడా సందడి చేస్తుంటారు. ఇంక రీల్స్, సాంగ్స్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ నటి రెండోసారి తల్లి అయిన విషయం తెలిసిందే. మొదటిసారి కుమార్తె కాగా.. రెండోసారి బాబు పుట్టాడు. ఆ విశేషాలు మొత్తాన్ని వీడియోల రూపంలో విడుదల చేస్తూనే ఉన్నారు.

Maheswari

తన రెండో కాన్పునకు సంబంధించి మహేశ్వరి అన్నీ వివరాలను వెల్లడిస్తూనే ఉంది. తన డైట్, తాను తీసుకుంటున్న జాగ్రత్తలు అన్నీ చెప్తూనే ఉంది. డెలివరీకి ముందు రోజు, డెలివరీ తర్వాత కూడా పూర్తి వివరాలను వెల్లడించారు. తాజాగా నటి మహేశ్వరి ఇంట సంబరాలు జరిగాయని తెలుస్తోంది. బాబుకు బారసాల కార్యక్రమం నిర్వహించినట్లు సమాచారం. బాబును ఉయ్యాల్లో వేసిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే బాబుకు ఏ పేరు పెట్టారు అనే విషయం మాత్రం తెలియరాలేదు. భర్త శివనాగ్, కుమార్తె హరిణితో కలిసి కుమారుడుని ఉయ్యాల్లో వేస్తున్న ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. బుల్లితెర అభిమానులు నటి మహేశ్వరి దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే బాబుకు ఏ పేరు పెట్టారు అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet