iDreamPost
android-app
ios-app

39 లక్షల రెమ్యూనరేషన్ ఇవ్వకుండా గదిలో బంధించారు.. ఆపై..: నటి ఆవేదన

  • Published May 02, 2024 | 3:35 PM Updated Updated May 02, 2024 | 3:35 PM

తనకు వచ్చే రూ. 39 లక్షల బాకీ ఇవ్వకుండా.. అడిగితే గదిలో పెట్టి బంధించారని ఓ ప్రముఖ సీరియల్ నటి ఆవేదన వ్యక్తం చేసింది. మరి ఆ నటి ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

తనకు వచ్చే రూ. 39 లక్షల బాకీ ఇవ్వకుండా.. అడిగితే గదిలో పెట్టి బంధించారని ఓ ప్రముఖ సీరియల్ నటి ఆవేదన వ్యక్తం చేసింది. మరి ఆ నటి ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published May 02, 2024 | 3:35 PMUpdated May 02, 2024 | 3:35 PM
39 లక్షల రెమ్యూనరేషన్ ఇవ్వకుండా గదిలో బంధించారు.. ఆపై..: నటి ఆవేదన

సినిమా ఇండస్ట్రీలో నటీ, నటుల జీవితాలు పైకి కనిపించేంత అందంగా ఉండవు. వారి సమస్యలు, కష్టాలు వారికి ఉంటాయి. కొంత మంది సినిమా ఆఫర్లు ఇస్తామని చెప్పి మోసం చేేస్తే.. ఇంకొందరు షూటింగ్ అంతా అయిపోయాక రెమ్యూనరేషన్ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు. తనకూ ఇలాగే జరిగిందంటూ ఓ నటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తనకు వచ్చే రూ. 39 లక్షల బాకీ ఇవ్వకుండా.. అడిగితే గదిలో పెట్టి బంధించారని సదరు నటి వాపోయింది. మరి ఆ నటి ఎవరు? డబ్బులు బాకీ ఉన్న నిర్మాత ఎవరు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ బుల్లితెర నటి కృష్ణ ముఖర్జీ శుభ్ షాగున్ సీరియల్ టీమ్ పై సంచలన ఆరోపణలు చేసింది. తనకు పారితోషికం ఇవ్వకుండా సెట్స్ లో ఇబ్బందులు పెట్టారని, గదిలో వేసి బంధించారని షాకింగ్ విషయాలు వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణ ముఖర్జీ మాట్లాడుతూ..”నిర్మాత కుందన్ సింగ్ చెప్పడం వల్లే వాళ్లు నన్ను గదిలో బంధించారు. ఒకటి కాదు.. రెండుసార్లు నన్ను గదిలో బంధించి, గూండాల్లా ప్రవర్తించారు. గెరెగావ్ లోని ఫేమస్ స్టూడియోలో ఇది జరిగింది. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ వివాదాన్ని ఎలా కవర్ చేయాలి? అని కుందన్ సింగ్ ఆలోచిస్తున్నాడు.

ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాక నాకు రావాల్సిన రెమ్యూనరేషన్ రూ. 39 లక్షలు ఇవ్వకుండా ఆపేసి, ఇబ్బందులు పెడుతున్నాడు. 12 గంటలు పని చేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదు. నాకే కాదు చాలా మందికి ఇలాగే చేస్తున్నాడు. దాంతో నేను డిప్రెషన్ లోకి వెళ్లి.. ఇప్పటికీ థెరపిస్టులను, డాక్టర్లను కలుస్తూనే ఉన్నాను. అయితే నన్ను గదిలో బంధించిన ప్రభాత్, సమీర్ లపై చర్యలు తీసుకుంది సీరియల్ యూనిట్ కు చెందిన స్వాతి తనవాల. దాంతో అప్పటి నుంచి వారు సెట్స్ లో కనిపించలేదు” అంటూ తన ఆవేదనను చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetovis girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş