iDreamPost
android-app
ios-app

పెళ్లైన నెలకే వివాహేతర సంబంధం బయటపడింది: నటి ఐశ్వర్య భర్త

  • Published Mar 13, 2024 | 10:22 AM Updated Updated Mar 13, 2024 | 11:56 AM

Aishwarya Addala: బుల్లితెర నటి అడ్డాల ఐశ్వర్య ఆమె భర్త శ్యామ్ కుమార్ వివాదంలో తాజాగా ట్విస్టుల మీద ట్విస్టులు అనేవి వెలుగులోకి వస్తున్నాయి.

Aishwarya Addala: బుల్లితెర నటి అడ్డాల ఐశ్వర్య ఆమె భర్త శ్యామ్ కుమార్ వివాదంలో తాజాగా ట్విస్టుల మీద ట్విస్టులు అనేవి వెలుగులోకి వస్తున్నాయి.

  • Published Mar 13, 2024 | 10:22 AMUpdated Mar 13, 2024 | 11:56 AM
పెళ్లైన నెలకే వివాహేతర సంబంధం బయటపడింది: నటి ఐశ్వర్య భర్త

బుల్లితెర నటి అడ్డాల ఐశ్వర్య పిన్నింటి శ్యామ్ కుమార్ వివాదంలో రోజుకో ట్విస్ట్ లు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే ఐశ్వర్య మంచిది కాదని ఆమె భర్త శ్యామ్ ఆరోపణలు చేయగా.. ఐశ్వర్య కూడా తన భర్త తనని వేధిస్తున్నాడంటూ రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంలో ఐశ్వర్యకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందంటూ తన భర్త శ్యామ్ ఆరోపణలు చేయడమే కాకుండా.. తన వద్ద రూ. 25 లక్షలు కాజేసి తనకు విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని వాపోయాడు. కానీ, ఐశ్వర్య మాత్రం అవన్నీ పచ్చి అబద్దాలని శ్యామ్ తనని కావలనే టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నాడు. అతడు మంచివాడు కాదనీ, పెళ్లైయిన దగ్గర నుంచి తనని వేధిస్తునే ఉన్నాడని చెప్పుకొచ్చింది. అయితే పెళ్లైయి ఏడాది కూడా తిరగక ముందే ఈ జంట ఇలా ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకోవడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా వీరి వివాదంలో మరో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నటి ఐశ్వర్య ఆమె భర్త శ్యామ్ కుమార్ వివాదంలో ట్విస్టుల మీద ట్విస్టులు అనేవి వెలుగులోకి వస్తున్నాయి. వీరిద్దరి వైవాహిక జీవితంలో ఏర్పాడ్డ తగదాలు రోడ్డుపైకెక్కడంతో అంతా వీరి గురించే మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. తాజాగా వీరి వివాదంలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. నటి ఐశ్వర్య ఫోన్ కాల్స్ ను ఆమె భర్త శ్యామ్ లైవ్ లో వినిపించాడు. ఆ ఫోన్ లో ఐశ్వర్య తన భర్త మంచివాడు కాదని శాడిస్ట్ అంటూ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. కానీ, మరోపక్క శ్యామ్ మాత్రం పెళ్లైన తర్వాత తన వద్ద రూ. 25 లక్షలు కాజేసి విడాకులివ్వాలంటూ..మానసికంగా వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అలాగే తన భార్య ఐశ్వర్యను దగ్గర నుంచి నిత్యం మందు సిగరెట్లు తాగేదని చెబుతున్నారు. అలాగే ఆమెకు హైదరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్  కరణం రమేష్ బాబుతో వివాహేతర సంబంధం ఉందని, పైగా తనని బెదిరింపులకు కూడా పాల్పడుతుందంటూ భర్త శ్యామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్యకు సంబంధించి ఒక్కొక్క నిజాలు ఆమె భర్త శ్యామ్ బయటపెట్టడంతో వీరి వివాదం మరింత ఆసక్తికరంగా మారింది.

కాగా, నటి ఐశ్వర్య, పిన్నింటి శ్యామ్ కు కాపు మ్యాట్రిమోని ద్వారా 2023 సెప్టెంబర్ 6న వివాహం జరిగింది. అయితే పెళ్లయిన నెల రోజలకే ఐశ్వర్య రిలిషేన్ బయటపడిందంటూ భర్త శ్యామ్ ఆరోపణలు చేయడం గమన్హారం. అలాగే తనవద్ద డబ్బులను కాజేసి విడాకులు కోరిందంటూ శ్యామ్ మీడియాను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక ఐశ్వర్య విషయానికొస్తే.. ఈమె అమ్మాయి గారు, పలుకే బంగారమాయనే, అలా వైకుంఠపురంలో, అత్తారింటికి దారేది వంటి తదితర సీరియల్స్ తో మంచి ఫేమ్ ను సంపాదించుకుంది. అయితే సీరియల్స్ లో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఐశ్వర్య.. వైవాహిక జీవితంలో మాత్రం తీవ్ర విమర్శలతో, ఆరోపణలతో బజారుపాలవ్వడం అందరికి ఆశ్చర్యనికి గురి చేసింది. మరి, సీరియల్ నటి ఐశ్వర్య పై భర్త చేసిన ఆరోపణల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişjojobet güncel girişjojobet girişmarsbahis giriş